Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో మిరియాల సాగును చూసిన రైతు, పామాయిల్ మొక్కలను అనువుగా చేసుకొని, మిరియాల మొక్కలను నాటారు. ప్రస్తుతం కోకో, మిరియాల పంటలపై వచ్చిన ఆదాయాన్ని ప్రధాన పంట అయిన ఆయిల్ ఫామ్ కు పెట్టుబడిగా పెడుతున్నారు.

Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

Oil palm cultivation

Intercrops In Palm Oil : దినదినాభివృద్ధి చెందుతున్న తోటపంట ఆయిల్ పామ్. నాటిన మూడేళ్ల వరకు ఈ తోటల నుండి ఎటువంటి దిగుబడి రాదు. రైతులు మొదటి  రెండు మూడు సంవత్సరాలు మాత్రమే అంతరపంటలు సాగుచేస్తుంటారు. ఆ తర్వాత చెట్లు ఎత్తుబాగా పెరుగుతాయి కనుక నీడ ఎక్కువగా వుండి అంతరపంటల సాగుకు అంతగా అనుకూలంగా వుండదనేది రైతుల అభిప్రాయం. కానీ ఆయిల్ పామ్ లో కోకో, మిరియాలను అంతర పంటలుగా సాగుచేస్తే దీటైన ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు.  కోకో , మిరియం పాక్షిక నీడలో  పెరిగే  మొక్క కనుక  మంచి ఫలితాను వస్తున్నాయి.

READ ALSO : Oil Farm Cultivation : వంట నూనెలకు పెరుగుతున్న డిమాండ్ నేపధ్యంలో ఆయిల్ ఫామ్ సాగు దిశగా అన్నదాతలు!

పార్వతీపురం మన్యం జిల్లా , గరుగుబిల్లి మండలం సుంకి గ్రామానికి చెందిన రైతు బోళ్ల సత్యనారాయణది. 1991 లో 5 ఎకరాల్లో పామాయిల్ మొక్కలను నాటారు. అయితే కొన్నేళ్లపాటు సాగు లాభదాయకంగానే ఉన్నా, తరువాత పామాయిల్ ధరలు తగ్గడంతో, ఉద్యాన అధికారుల సూచనల మేరకు, అంతర పంటగా 2000 సంవత్సరంలో కోకో మొక్కలు నాటారు.

READ ALSO : Telangana Cabinet: ఆయిల్ ఫామ్ సాగు.. పంటవేస్తే ఎకరాకు రూ.26 వేలు!

ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో మిరియాల సాగును చూసిన రైతు, పామాయిల్ మొక్కలను అనువుగా చేసుకొని, మిరియాల మొక్కలను నాటారు. ప్రస్తుతం కోకో, మిరియాల పంటలపై వచ్చిన ఆదాయాన్ని ప్రధాన పంట అయిన ఆయిల్ ఫామ్ కు పెట్టుబడిగా పెడుతున్నారు. ఆయిల్ ఫాం పై వచ్చినది నికర ఆదాయం అంటున్నారు రైతు.

READ ALSO : Oil Palm Farming : ఆయిల్ పామ్ తోటల్లో మేలైన యాజమాన్యం.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు

ఆయిల్ పామ్ దీర్ఘకాలపు పంట.  పంట వేసిన మొదటి మూడు సంవత్సరాల వరకు ఫలసాయం ఉండదు. మొక్కలను త్రిభుజాకారపు పద్ధతిలో 9 మిటర్ల దూరంతో నాటుతారు. మొక్కల మధ్య మొదటి మూడు సంవత్సరాల కాలంలో ఖాళీ స్థలం ఉంటుంది. నీటి వసతి సమృద్ధిగా ఉన్న ఆయిల్ పామ్ తోటలలోని ఖాళీ స్థలంలో మొదటి మూడేళ్ళ వరకు , తరువాత ఎనిమిదేళ్ళ పైబడిన తోటలలో అంతర పంటలు వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగానే రైతు సత్యనారాయణ సాగును మొదలు పెట్టారు. ఈ సాగును చూసి చుట్టుప్రక్కల రైతులు సైతం అంతర పంటలుగా కోకో, మిరియాలను సాగుచేస్తూ.. అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.