Groundnut Cultivation : వేరుశనగ విత్తుకునే చివరి సమయం.. అధిక దిగుబడులకోసం సాగులో మెళకువలు  

Groundnut Cultivation : వేరుశనగ పంటకు తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు విత్తేముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. అలాగే పంట ఏపుగా పెరిగేందుకు దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు అందించాలి.

Groundnut Cultivation : వేరుశనగ విత్తుకునే చివరి సమయం.. అధిక దిగుబడులకోసం సాగులో మెళకువలు  

Matti Manishi

Updated On : October 23, 2024 / 2:30 PM IST

Groundnut Cultivation : ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగుచేసిన వేరుశనగ వీస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. పంట చేతికొస్తుందని రైతులు భావిస్తున్న తరుణంలో అధిక వర్షాలు చాలావరకు పంటను దెబ్బతీసాయి. చూస్తుండగానే రబీకాలం వచ్చేసింది. ఇప్పుడు వేరుశనగను సాగుచేయలంటే నీటిసౌకర్యం తప్పనిసరిగా వుండాలి.  ప్రస్తుతం భూగర్భ జలాలు, జలాశయాల్లో నీరు ఆశాజనకంగా వుండటంతో  రైతులు వేరుశనగ సాగుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. అయితే రబీ వేరుశనగలో అధిక దిగుబడి సాధించేందుకు పాటించాల్సిన మేలైనన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేరుశనగ సాగులో సగటు వుత్పత్తి మన ప్రాంతంలో 5 నుండి 6క్వింటాళ్లకు మించటంలేదు. దీనికి ప్రధానంగా వేరుశనగలో ఆయాప్రాంతాలకు అనుగణంగా రకాల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోవటం, యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.  వర్షాధార వ్యవసాయంలో రైతుకు కొన్ని ఇబ్బందులు వున్నా.. రబీలో నీటిపారుదల కింద చేపట్టే యాజమాన్యం, పూర్తిస్థాయిలో రైతు నియంత్రణలో వుంటుంది.

కనుక రబీ వేరుశనగసాగులో మంచి ఫలితాలు పొందే వీలుంది. సాధారణంగా మనకు అందుబాటులో వున్న రకాలన్నీ 12క్వింటాళ్లకు  పైబడి దిగుబడి నిస్తున్నాయి. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 20క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధించే అవకాశం వుంది. రబీ వేరుశనగలో అధిగ దిగుబడి కోసం పాటించాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త డా. రంజిత ద్వారా తెలుసుకుందాం.

వేరుశనగ పంటకు తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు విత్తేముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. అలాగే పంట ఏపుగా పెరిగేందుకు దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు అందించాలి. వేరుశనగ పంట పూత సమయంలో లేదా కలుపు తీసే సమయంలో జిప్సంను తప్పనిసరిగా వేయాలి. ఈ దశలో వేరుశనగ ఊడలు అభివృద్ధి చెందే దశలో వుంటుంది. జిప్సం వేయటం వల్ల మొక్కల్లో వ్యాధి నిరోధక శక్త పెరగటంతోపాటు, గింజల్లో నూనె శాతం పెరుగుతుంది.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..