Virginia Tobacco : ట్రిపుల్ సెంచరీ దిశగా పొగాకు ధరలు
ఈ ఏడాది పొగాకు కొనుగోలు ప్రారంభంలో కిలో ధర రూ.210 పలికింది. దీంతో ధరపై రైతులు నిరాశ చెందినా.. ప్రస్తుతం రోజు రోజుకి పెరుగుతున్న ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు అమ్మకాలు చివరి దశకు వచ్చేవరకు ధర తగ్గకుండా ఉండాలని కోరుకుంటున్నారు.
Virginia Tobacco : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రధాన వాణిజ్య పంటైన వర్జీనియా పొగాకు ధరలు ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను తాకేందుకు పరుగులు పెడుతుంది. వర్జీనియా పొగాకు చరిత్రలోనే ఈ ధరలు అత్యధికం. ఈ ఏడాది ధరలు వేలం ప్రక్రియ ప్రారంభం నుంచే ఆశాజనకంగా ఉన్నాయి. ఎన్.ఎల్.ఎస్ (నార్త్ లైట్ సాయిల్) పరిధిలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ధరలు పడడంతో పాత రికార్డులు కనుమరుగయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లా రైతుల ఆనందానికి అవధులు లేవు. ధర చివరివరకు ఇలాగే కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
READ ALSO : Bengaluru : బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు .. చూసేందుకు ఎగబడ్డ స్ధానికులు
పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు ధరలు ఆల్ టైమ్ రికార్డులు నమోదు చేసుకుంటున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈ సారి ధరలు అధరహో అనిపిస్తున్నాయి. నాలుగైదు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో రికార్డు ధరలు రాలేదని రైతులు అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని 5 వేలం కేంద్రాల్లో కేజీ గరిష్ట ధర రూ. 288 నమోదు కావడం కూడా రికార్డే.
అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో గ్రేడ్లతో సంబంధం లేకుండా పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. గత సీజన్ తో పోలిస్తే ఈ సారి సరాసరి ధర సుమారు రూ. 43 పెరిగింది. ఎప్పుడూ కనీవిని ఎరుగని ధరలు పడడంతో పాత రికార్డులు బద్దలవుతున్నాయి.
ఒకప్పుడు పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక నష్టాల పాలై కుటుంబాలకు కుటుంబాలే దిక్కులేనివయ్యాయి. నాడు పగాకు ఉన్న పొగాకు నేడు సిరులు కురిపిస్తోంది. పొగాకు పంట పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక స్థాయి ధర పలకడంతో రైతు కాలర్ ఎగురేస్తున్నాడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఐదు పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలో రెండు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లిలో పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి.
దాదాపు 10 వేల హెక్టార్లలో ప్రతి ఏటా పొగాకు సాగవుతుంది . ఈ ఏడాది పొగాకు కొనుగోలు ప్రారంభంలో కిలో ధర రూ.210 పలికింది. దీంతో ధరపై రైతులు నిరాశ చెందినా.. ప్రస్తుతం రోజు రోజుకి పెరుగుతున్న ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు అమ్మకాలు చివరి దశకు వచ్చేవరకు ధర తగ్గకుండా ఉండాలని కోరుకుంటున్నారు.
READ ALSO : YS Sharmila : తెలంగాణలో 40వేల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్- సీఎం కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
అంతర్జాతీయ మార్కెట్ లో వర్జీనియా పొగాకు మంచి డిమాండ్ ఉండటంతో ప్రస్తుత ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది కర్ణాటకలో కిలో ధర రూ.260 అత్యధికంగా పలికింది. అదే ధరతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరినా మొన్నటి వరకు కిలో ధర రూ. 210 కే కొనుగోలు చేశారు.
అయితే ప్రస్తుతం నాసి రకం పొగాకు కూడా ధర బాగా పలకడం ఈ ఏడాది విశేషం. సుమారు రైతుల వద్ద 50 శాతం పొగాకు అమ్మకాలు జరిగాక ఇప్పుడు ధర పెరగడంతో కొంత మంది రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి ఇదే ధర రైతుకు దక్కితే పొగాకు రైతులు మొత్తం అప్పుల నుంచి బయట పడే వాళ్ళమని చెబుతున్నారు.
READ ALSO : Gannavaram: గన్నవరం వైసీపీలో మూడు వర్గాలు.. దుట్టా, యార్లగడ్డ, వంశీ ఒక్కతాటిపైకి రావడం సాధ్యమా?
మొత్తానికి అటు కర్ణాటక తో పాటు ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ఏడాది వర్జీనియా పొగాకు కు మంచి ధర పలుకుతుంది. కిలో రూ.300 వరకు వెళ్లవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా రైతులకు మంచి ధర ఇవ్వాలని ప్రస్తుత ధరలు ఊరట నిస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.