Prawns Export : ఎగుమతుల్లో టాప్… మీసం మెలేసిన ఆంధ్ర రొయ్య

దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఇతర దేశాలకు ఎగుమతవుతున్న ఉత్పత్తుల , తద్వారా వస్తున్న అదాయనికి సంబంధించిన వివరాలను డీజీసీఐఎస్ తెలిపింది.

Prawns Export : ఎగుమతుల్లో టాప్… మీసం మెలేసిన ఆంధ్ర రొయ్య

Prawns

Updated On : August 11, 2021 / 3:50 PM IST

Prawns Export : కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కరోనా పరిస్ధితులు ప్రపంచదేశాలను తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులకు గురిచేస్తుండగా ఈతరహా పరిస్ధితుల్లోనూ భారతదేశం వాణిజ్య,వ్యాపార ఎగుమతుల్లో తనదైన సత్తాను చాటుకుంటుంది. 2020సంవత్సరానికి సంబంధించి ఎగుమతులపై డీజీసీఐఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం…

రోయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ తన సత్తాని చాటుకుంది. ఏపి నుండి ప్రపంచంలోని 61 దేశాలకు రొయ్యలు ఎగుమతవుతున్నాయి. రొయ్యల ఉత్పత్తిలో ఏపి అగ్రస్ధానంలో ఉంది. నాణ్యమైన , రుచికరమైన రొయ్యలను సాగు చేస్తుండటమే ఇందుకు కారణం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్ష్ అండ్ స్టాటిస్టిక్స్ (డీజీసీఐఎస్) 2020లో నివేదికలే ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం రొయ్యల ఎగుమతి విలువ అక్షరాల 16,183కోట్లుగా ప్రకటించింది.

దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఇతర దేశాలకు ఎగుమతవుతున్న ఉత్పత్తుల , తద్వారా వస్తున్న అదాయనికి సంబంధించిన వివరాలను డీజీసీఐఎస్ తెలిపింది. ఏపి నుండి 45 దేశాలకు బియ్యం ఎగుమతవుతుండగా, వీటి విలువ 3,015.9 కోట్లుగా ఉంది. రొయ్యలతోపాటు, ఫెర్రో సిలికా, మాంగనీస్ వంటి ఖనిజ సంపద ఏపి నుండి 69 దేశాలకు ఎగుమతి అవుతుంది. పొగాకు, క్యాప్సికం వంటివి అధికంగా ఎగుమతైనట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఇదిలా వుంటే గుజరాజ్ రాష్ట్రం నుండ 48దేశాలకు 77,325.1కోట్ల విలువైన డీజిల్ ఎగుమతులు జరిగినట్లు డీజీసీఐఎస్ నివేదికలో స్పష్టం చేసింది. మహరాష్ట్ర నుండి 77 దేశాలకు డైమండ్స్ ఎగుమతి అవ్వగా మన దేశం నుండి అతిపెద్ద విలువకలిగిన ఎగుమతుల్లో ఇవి ఉన్నాయి. హరియాణా నుండి బిర్యానీలో వినియోగించి బాస్మతి రకం బియ్యం 121దేశాలకు ఎగుమతయ్యాయి. వీటి విలువ అక్షరాల 16,443.09 కోట్లుగా డిజీసిఐఎస్ తెలిపింది.

కేరళ నుండి బంగారం అధికంగా ఎగుమతైంది. ఎనిమిది దేశాలకు బంగారం ఎగుమతికాగా దాని విలువ 43,233.83కోట్లుగా నమోదైంది. అదే సమయంలో కేరళ నుండి జీడిపప్పు 47దేశాలకు పంపారు. జమ్మూకశ్మీర్ నుండి ఉన్ని, సిక్కిం పాస్తాను, త్రిపుర ఉల్లిగడ్డలు, ఢిల్లీ నుండి టర్భోజెట్స్ ఎగుమతి అయ్యాయి. ఉత్తర ప్రదేశ్ మాసం ఎగుమతుల్లో అగ్రస్ధానంలో ఉండగా, తెలంగాణా, హిమాచల్ ప్రదేశ్ మెడిసిన్స్ ఎగుమతులు అధికంగా ఉన్నాయి. కర్ణాటక, బీహార్ ల నుండి హైస్పీడ్ డీజిల్ ఎగుమతైంది.