Vanami Prawn Cultivation : వనామి రొయ్య రైతులు.. సాగులో పాటించాల్సిన మెళకువలు

చెరువులో రొయ్యలు అలవాటు పడిన నీటి సెలైనిటీలో హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్త వహించాలి. అయితే వర్షాలు కురిసినప్పుడు, నీటి ఉప్పదనంలో సంభవించే మార్పులు వల్ల రొయ్యలు ఒత్తిడికి గురై వ్యాధులకు లోనవటం జరుగుతోంది.

Vanami Prawn Cultivation : వనామి రొయ్య రైతులు.. సాగులో పాటించాల్సిన మెళకువలు

Prawn Farming

Updated On : September 28, 2023 / 9:56 AM IST

Vanami Prawn Cultivation : ఆంధ్రప్రదేశ్ లో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ఆక్వారంగం. మంచినీటి చేపల పెంపకం స్థిరంగా కొనసాగుతున్నా….సముద్ర తీర ప్రాంతాలు, ఉప్పునీటి చెరువుల్లో 2018 వరకు వనామి రొయ్య కల్చర్ శరవేగంగా అభివృద్ధి చెంది, రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపింది. అయితే ఇప్పుడు వనామి సాగులో రైతులు ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. కల్చర్ విజృంభిస్తున్న వ్యాధులు, తీవ్రమైన మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల, అనేక సమస్యల మధ్య వనామి సాగును నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్థుతం శీతాకాలపు పంటకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపధ్యంలో వనామి రొయ్య సాగులో పాటించాల్సిన మెళకువలు గురించి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్యకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. పి. హరిబాబు రైతాంగానికి తెలియజేస్తున్నారు.

READ ALSO : Cotton Crop : పత్తిచేలలో వర్షపు నీరు.. చీడపీడలు సోకే అవకాశం

దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వారంగంలో, సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్ లో వివిధ బాక్టీరియా వైరస్ వ్యాధుల దాడి కల్చర్ ను అతలాకుతలం చేస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో వాతావరణ ఒడిదుడుకులు, అధిక వర్షాల వల్ల రొయ్యల సాగులో సమస్యలు అధికంగా వుంటాయి. దీంతో చాలామంది రైతులు శీతాకాలం, వేసవి కాలాల్లో కల్చర్ కొనసాగుస్తున్నారు. అయినా తరచూ ఏర్పడే వాతావరణ ఒడిదుడుకుల వల్ల వ్యాధుల ఉధృతి తప్పటం లేదు. రైతులు అవగాహన లోపం కూడా వ్యాధుల తీవ్రత పెరిగేందుకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా వనామి సాగు చెరువులో నీటి ఉప్పదనం అంటే సెలైనిటీ 8 నుండి 25 మధ్య వుండాలి.

READ ALSO : Pests In Sesame : నువ్వు పంటసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

చెరువులో రొయ్యలు అలవాటు పడిన నీటి సెలైనిటీలో హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్త వహించాలి. అయితే వర్షాలు కురిసినప్పుడు, నీటి ఉప్పదనంలో సంభవించే మార్పులు వల్ల రొయ్యలు ఒత్తిడికి గురై వ్యాధులకు లోనవటం జరుగుతోంది. సాధారణంగా చెరువులో బాక్టీరియా వృద్ధి అనేది సహజంగానే వుంటుంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో చెరువు వాతావరణంలో మార్పులు వల్ల హానికారక బాక్టీరియా, వైరస్ వృద్ధి చెందటం, రొయ్యల ఒత్తిడికి గురై బలహీనపడినప్పుడు ఇవి దాడి చేయటం వల్ల రైతులు నష్టపోతున్నారు. దీనికితోడు అవసరానికి మించి రొయ్యల మేత వినియోగం వల్ల, నీటిలో హానికారక వాయువులు అభివృద్ధి చెంది, వ్యాధుల దాడి పెరిగిపోతోంది.

READ ALSO : Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

గతంలో ఎకరాకు 2లక్షలకు పైగా రొయ్య పిల్లను వదిలిని రైతులు ప్రస్థుతం ఈ సంఖ్యను 1 లక్ష పిల్లకు తగ్గించినప్పటికీ సమస్యలు తగ్గుముఖం పట్టలేదు. ప్రస్థుతం రైతులు శీతాకాలపు పంట సాగుకు సిద్ధం అయిన నేపధ్యంలో, వనామి కల్చర్ లో యాజమాన్యం పట్ట తగిన అవగాహన ముందడుగు వేయాలని సూచిస్తున్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. హరిబాబు.

READ ALSO : Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !

రొయ్యల మేత వినియోగంలో రైతులు చెక్ ట్రేల ఆధారంగా రోజుకు ఎంత మేత వినియోగం అవుతుందనేది నిర్ధారించుకుని తదనుగుణంగా మేతను అందించాలి. దీనివల్ల మేత వృధా తగ్గి చెరువులో విషవాయువులు ప్రబలకుండా వుంటాయి. వర్షాలు, వాతావరణ మార్పులు సంభవించినప్పుడు శాస్త్రవేత్తలు నిర్థేశించిన చర్యలు చేపడితే రొయ్యలు ఒత్తిడికి లోనవకుండా, చెరువులో హానికారక బాక్టీరియ, వైరస్ వ్యాధుల ప్రభలకుండా నివారించవచ్చు.