Warangal Kandi : అధిక దిగుబడినిచ్చే వరంగల్ కంది రకాలు

Warangal Kandi : ఖరీఫ్‌ సాగుకు అనువైన మధ్య స్వల్పకాలిక నూతన కంది రకాలను వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించి.. రైతులకు అందుబాటులోకి ఉంచారు. వాటి గుణగణాలే ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

Warangal Kandi : అధిక దిగుబడినిచ్చే వరంగల్ కంది రకాలు

Varieties of Warangal Kandi

Warangal Kandi : అపరాల పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏక పంటగాను, అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో రైతులు సాగుచేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో జూన్ నుండి జులై 15 వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు. అయితే ఖరీఫ్‌ సాగుకు అనువైన మధ్య స్వల్పకాలిక నూతన కంది రకాలను వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించి.. రైతులకు అందుబాటులోకి ఉంచారు. వాటి గుణగణాలే ఏంటో ఇప్పుడు చూద్దాం..

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

పప్పుదినుసు పంటల్లో అతి ప్రధానమైన కంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 8లక్షల ఎకరాల్లో కంది సాగవుతుంది. దీనిని ఖరీఫ్‌లో వర్షాధారపు పంటగాను, రబీలో నీటివసతి కింద పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు విత్తనం విత్తే మొదలు కోత వరకు పూర్తిగా యాంత్రీకరణకు అనుకూలమైన పంట. కందిని అన్ని రకాలు నేలల్లో సాగు చేసుకోవచ్చు.

అయితే ఖరీఫ్‌లో ఇప్పటివరకు రైతులు కందిలో మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ.. వచ్చారు. దీంతో పంట చివరి దశలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు తగ్గి.. రైతులు నష్టపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మద్యస్థ స్వల్పకాలిక రకాలకు రూపొందించారు. వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వారు ఐదు నూతన కంది రకాలను విడుదల చేశారు. అయితే వాటి గుణగణాలు ఏంటో తెలియజేస్తున్నారు పరిశోధనా స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త సంధ్యాకిషోర్‌.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు