Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక
నేల అంటే కంటికి కనిపించే బాహ్య పొర కాదు.. దానిలోపల ఎన్నో పొరలను అంతర్భాగంగా కలిగిన ఒక సముదాయం. మన భవిష్యత్ ఆరోగ్యకరమైన నేలపైనే ఆధారపడి ఉంటుంది . నేల లేకుండా ఆహార భద్రత ఉండదు. భారీ సంఖ్యలో సూక్ష్మజీవులకు నివసించేందుకు ఆవాసం కల్పిస్తుంది .

cultivated in which soils
Types Of Soils : పంట పండించే నేల స్వభావాన్ని బట్టి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే చాలా మంది రైతులు ఇష్టానుసారంగా రసాయన మందులు చల్లుతున్నారు. భూమిని పట్టించుకోకుండా ఇలాంటి ఎరువులు చల్లుతుండడంతో భూములతో పాటు పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపధ్యంలో.. అసలు ఎలాంటి వ్యవసాయ భూములున్నాయి… వాటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ? ఏఏ పంటలు సాగుచేయాలో ఇప్పుడు చూద్దాం..
READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు
నేల అంటే కంటికి కనిపించే బాహ్య పొర కాదు.. దానిలోపల ఎన్నో పొరలను అంతర్భాగంగా కలిగిన ఒక సముదాయం. మన భవిష్యత్ ఆరోగ్యకరమైన నేలపైనే ఆధారపడి ఉంటుంది . నేల లేకుండా ఆహార భద్రత ఉండదు. భారీ సంఖ్యలో సూక్ష్మజీవులకు నివసించేందుకు ఆవాసం కల్పిస్తుంది . అవి మట్టికి పోషకాలను అందించడం వల్ల పరస్పర సహజీవనం, సుస్థిరమైన వాతావరణ సమతుల్యతకు దారితీస్తోంది.
READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నేలపై రైతులకు అవగాహన లేక అధిక దిగుబడులకోసం అనేక రసాయన మందులను వెదజల్లుతూ.. జీవచ్చవం లేకుండా చేస్తున్నారు. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నేల రకాలు ఉన్నాయి… వాటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ? ఏఏ పంటలు సాగుచేయాలో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాజేశ్వర్ నాయక్.
READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు
తెలంగాణలో 22 రకాల నేలలు ఉన్నాయన్నారు. నల్ల, ఎర్ర నేలల్లోనే అనేక రకాలు ఉన్నాయి. నీటి నిలువ సామర్థ్యం, పోషకాల లభ్యత నేల స్వభావం బట్టి ఉంటుంది . అక్కడక్కడా చౌడు భూములు ఉన్నాయి. ముఖ్యంగా నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంది. వీటిని సరిచేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.