Jasmine Cultivation : గుండు మల్లెసాగుతో.. గుభాలిస్తున్న లాభాలు

Jasmine Cultivation : గుండు మల్లెసాగుతో.. గుభాలిస్తున్న లాభాలు

Jasmine Cultivation

Updated On : November 5, 2023 / 3:00 PM IST

Jasmine Cultivation : కొన్ని రకాల పుష్పాలు కేవలం ఆకట్టుకోగలవు. మరికొన్ని రకాల పూలు సువాసనలతో మనసు దోచుకోగలవు. కానీ మనిషి మనసుకు ప్రశాంతతను చేకూర్చడంతో పాటు తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సుగంధ పువ్వు మల్లె. అందుకే దీన్ని పుష్పాల రాణిగా పరిగణిస్తారు.  మండు వేసవిలో విరగపూసే మల్లె రైతుకు లాభాలను అందించే పంటగా పేరుగాంచింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు గుండుమల్లెలను సాగుచేసి.. లాబాలను పొందేందుకు సిద్ధమవుతున్నారు.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

వేసవికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా మల్లెల పరిమళాలే.  కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తుంటాయి. సాయంత్రంపూట మొగ్గలను తెంపి, కొన్ని మొగ్గలను మాలలు కట్టి,  తడి గుడ్డలో చుట్టి పెడితే మరునాడు ఉదయానికి మల్లెలు విచ్చుకుని సువాసనలు వెదజల్లుతాయి. మల్లె పువ్వును ఇష్టపడని  మగువలు వుండరు.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

ప్రధానంగా ఈ తోటలు వేసవిలో అధిక పూల దిగుబడినివ్వటంతో రైతులతోపాటు, కూలీలకు కూడా మంచి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా  చిన్న, సన్నకారు రైతులు ఈ తోటలను పావు ఎకరం నుండి 2 ఎకరాల వరకు సాగుచేస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, చిన్నతాడేపల్లి గ్రామానికి చెందిన రైతు పిచ్చుకల వెంకటనారాయణ గత ఏడాది సెంప్టెంబర్ నెలలో తనకున్న 2 ఎకరాల్లో గుండుమల్లె మొక్కలను నాటారు. ప్రస్తుతం పంట దిగుబడులు వస్తున్నాయి. అన్ సీజన్ లో మల్లెపూల దిగుబడి వస్తుండటంతో ధరలు కూడా భాగానే ఉన్నాయంటున్నారు.