Zinc Deficiency : ప్రధాన పంటలసాగులో జింకు లోపం! నివారణ పద్ధతులు
మొక్కలో అమినో అమ్లాలు, మాంసకృత్తులు తయారు కావడానికి జింకు ఉపయోగ పడుతుంది. నత్రజని, భాస్వరం పోషకాల సమర్థ వినియోగానికి కూడా జింకు తోడ్పడుతుంది. మొక్క ఎదుగుదలకు కావాల్సిన ఇండోల్ అసెటిక్ ఆసిడ్ అనే హార్మోను తయారు కావడానకి జింకు ఉపయోగపడుతుంది.

Zinc deficiency in the main crops! Prevention methods
Zinc Deficiency : రైతులు సాగు చేసే పంటలకు సూక్ష్మపోషకమైన జింకు మొక్కలకు కొద్ది మోతాదులో అవసరమౌతుంది. సాగు చేస్తున్న భూమిలో ఈ పోషకం లోపిస్తే నత్రజని, భాస్వరం, పొటాష్ లు సరైన మోతాదులో వేసిన ఎలాంటి ఫలితం ఉండదు. జింకు లోపాన్ని సకాలంలో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే ముఖ్యమైన పోషకాలు బాగా ఉపయోగపడి పంట దిగుబడులు పెరుగుతాయి.
జింక్ లోపం కారణాలు :
రైతులు సాధారణంగా నత్రజని, భాస్వరం, పొటష్ వేయడానికి అలవాటుపడ్డారు. జింకు, ఇతర సూక్ష్మ పోషకాలను ప్రత్యేకించి పైర్లకు వేయటం లేదు. అధిక దిగుబడి రకాలు, సంకర రకాలు వేయడం వల్ల తక్కువ కాలపరిమితి రకాలతో సంవత్సరంలో ౩-4పంటలు పండిస్తున్నారు. సాంద్ర వ్యవసాయంతో పాటు , దిగుబడులు బాగా పెరగడం వల్ల భూమిలో సహజంగా ఉండే సూక్ష్మపోషక నిల్వలు త్వరగా, క్రమంగా ఖాళీ అవుతున్నాయి. దీనికి తోడు సేంద్రియ ఎరువుల వాడకం కూడా తగ్గింది. ఈ కారణాల వల్ల సూక్ష్మపోషకాలతో ముఖ్యమైన పంటల్లో దిగుబడిని తీవ్రంగా తగ్గిస్తాయి.
జింక్ లోపానికి దారితీసే పరిస్థితులు ;
అధిక మొతాదులల్లో నత్రజని, భాస్వరం ఎరువుల వాడకం, పోషకాల సమతుల్యత లోపించడం కారణం. సంవత్సరంలో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటూ మురుగు పోని పల్లపు ప్రాంతాలు మరో కారణం. సున్నపు పాలు, క్షార గుణం ఎక్కువగా ఉన్న నల్ల రేగడి నేలల్లో జింక్ లోపం కనిపిస్తుంది. బాగా మాగిన సేంద్రియ ఎరువులు తగినంత పరిమాణంలో వేయక పోవడం, సరిగా చివకని సేంద్రియ ఎరువుల వాడకపోవటం జింకు లోపం ఏర్పడుతుంది. చలికాలంలో ఉష్టోగ్రతలు తక్కువగా ఉన్న సమయంలో వేసిన పైర్లలో జింకు లోప తీవ్రత అధికంగా ఉంటుంది.
జింకు వల్ల ఉపయోగాలు ;
మొక్కలో అమినో అమ్లాలు, మాంసకృత్తులు తయారు కావడానికి జింకు ఉపయోగ పడుతుంది. నత్రజని, భాస్వరం పోషకాల సమర్థ వినియోగానికి కూడా జింకు తోడ్పడుతుంది. మొక్క ఎదుగుదలకు కావాల్సిన ఇండోల్ అసెటిక్ ఆసిడ్ అనే హార్మోను తయారు కావడానకి జింకు ఉపయోగపడుతుంది. కార్బ్చోఎన్‌మైడ్రేస్, అల్మహాల్ డీ హైడ్రోజినేస్ వంటి ఎంజైముల్లో జింకు ఒక ముఖ్యభాగం.
జింకు కనీస స్థాయి:
జింకు సాధారణ నేలలో 1.0 పి.పి.ఎం. ఉంటే మంచి దిగుబడి ఇవ్వడానికి సరిపోతుంది. 0.65 పి.పి.ఎం. నేలలో కనీస స్థాయి గాను, మొక్కలోని ఆకు భాగాల్లో 20 పి.పి.ఎం. కనీస స్థాయిగాను నిర్ధారించారు. ఈ స్థాయికి తగ్గినప్పుడు పైర్తలో లోప లక్షణాలు కనిపిస్తాయి. లోపం సరిదిద్ధకపోతే దిగుబడి తగ్గడం, సరిదిద్దితే దిగుబడి పెరగడం స్పష్టంగా గమనించవచ్చు. అయితే మొక్కల్లో జింకు 400 పి.పి.ఎం. మించి ఉన్నప్పుడు హానికరంగా పరిణమిస్తుంది.
లోప నిర్ధారణ :
జింకు లోపం నిర్ధారించడానికి మూడు పద్ధతులు ఉన్నాయి.1. మట్టి నమూనాల విశ్లేషణ 2. మొక్క ఆకు భాగాల విశ్లేషణ 3. మొక్కపై కనిపించే లోప లక్షణాల ఆధారంగా లోప నిర్ధారణ.
మొదటి రెండు పద్ధతులు ప్రయోగశాలలో మాత్రమే చేయవచ్చు. మూడవ పద్ధతి ఏ పరికరాలు అవసరం లేకుండానే పైరుపై లక్షణాలను చూసి లోపం నిర్ధారించడం. లోప లక్షణాలను గురించి అవగాహన కలిగి, గుర్తించడంలో అనుభవం ఉన్నవారు జింకు లోపాన్ని సులభంగా గుర్తించగలరు.
జింకులోప సవరణ :
జింకులోపం సరిదిద్దడానికి జింకు లవణాలు, జింకు ఛిలేట్లు, జింక్ ఫ్రిట్స్ దేన్నయినా వాడవచ్చు. సాధారణంగా జింక్ సల్ఫేట్ , జింకు చీలేట్స్ వాడవచ్చు. గాజు కర్మాగారాల్లో తయారయ్యే జింక్ ఫ్రిట్స్ కూడా వాడవచ్చు. జింకును చివరి దుక్కిలో నేలకు వేయడం వల్లగాని, పైరుపై ద్రావణాన్ని పిచికారీ చేయటం ద్వారా గాని లోపాన్ని నివారించుకోవచ్చు.