AP Corona Cases : ఏపీలో కొత్తగా 10,759 కరోనా కేసులు, 31 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో తొలిసారి పది వేల మార్క్‌ను దాటాయి.

AP Corona Cases : ఏపీలో కొత్తగా 10,759 కరోనా కేసులు, 31 మంది మృతి

10759 New Corona Cases In Ap

Updated On : April 23, 2021 / 11:31 AM IST

new corona cases in AP : ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో తొలిసారి పది వేల మార్క్‌ను దాటాయి. మరో 10 వేల 759 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 66వేల 944 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకూ 7వేల 541 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు, కృష్ణ జిల్లాల్లో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,474 కేసులు నమోదు కాగా.. కర్నూలు జిల్లాలో 1,367, శ్రీకాకుళం జిల్లాలో 1,336 కేసులు రికార్డయ్యాయి.