సర్వేలు: టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్.. మరి ఏపీలో!

  • Published By: vamsi ,Published On : March 11, 2019 / 03:13 AM IST
సర్వేలు: టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్.. మరి ఏపీలో!

ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్ వచ్చేసింది. ఈ నేపధ్యంలో పలు సర్వేలు ఏమి చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలకు నిర్వహించిన సర్వేలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రీ పోల్ సర్వే ఫలితాలు చెబుతుంటే.. 2014 ఎన్నికల్లో కంటే దాదాపు నలభై సీట్లు తగ్గుతాయని, కానీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని ఈ సర్వేల్లో వెల్లడిస్తున్నాయి. 

ఈ మేరకు ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్(80):     బీజేపీ 40, ఎస్పీ 18, బీఎస్పీ 16, కాంగ్రెస్‌ 4, ఆర్‌ఎల్డీ 1, అప్నా దళ్‌ 1
పశ్చిమబెంగాల్‌(42):    టీఎంసీ 30, బీజేపీ 12
రాజస్తాన్‌(25):     బీజేపీ 20, కాంగ్రెస్‌ 5
మధ్యప్రదేశ్‌(29):     బీజేపీ 23, కాంగ్రెస్‌ 6
గుజరాత్‌(26):     బీజేపీ 26: ఢిల్లీ(7): బీజేపీ 7  
మహారాష్ట్ర(48):     బీజేపీ 22, శివసేన 10, కాంగ్రెస్‌ 9, ఎన్సీపీ 7
బిహార్‌(40):        బీజేపీ 15, జేడీయూ 12, ఆర్జేడీ 8, ఎల్జేపీ 3, కాంగ్రెస్‌ 2
తమిళనాడు(39):    డీఎంకే 16, ఏడీఎంకే 12, కాంగ్రెస్‌ 5, పీఎంకే 2, బీజేపీ 1
కర్ణాటక(28):        బీజేపీ 13, కాంగ్రెస్‌ 13, జేడీఎస్‌ 2
కేరళ(20):        యూడీఎఫ్‌ 12, ఎల్డీఎఫ్‌ 7, బీజేపీ 1
తెలంగాణ(17):    టీఆర్‌ఎస్‌ 14, కాంగ్రెస్‌ 2, ఎంఐఎం 1
ఆంధ్రప్రదేశ్(25):    వైఎస్సార్సీపీ 22, టీడీపీ 3 

అలాగే కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సీ-ఓటర్ సర్వే స్పష్టం చేసింది. 

మొత్తం 543 లోక్ సభ స్థానాల్లో ఎన్డీఏకు 264 సీట్లు, కాంగ్రెస్ కు 141 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25పార్లమెంట్ స్థానాల్లో 14 టీడీపీ, 11 సీట్లను వైఎస్ఆర్ సీపీ గెలుచుకుంటుందని అంచనా వేసింది. అలాగే సీ-ఓటర్ సర్వే ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేయనుందని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. 17 సీట్లలో 16 సీట్లు టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందంటూ సీ ఓటరు సర్వేల్లో వెల్లడైంది. 16 టీఆర్‌ఎస్, 1 ఎంఐఎం గెలుచుకుంటాయని సీ ఓటరు సర్వే స్పష్టం చేసింది.