ఏపీలో కరోనా ఉగ్రరూపం…24 గంటల్లో 2,593 పాజిటివ్ కేసులు..40 మంది మృతి

కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడిపోతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 38 వేలు దాటింది. 24 గంటల్లో కొత్తగా 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బ 38,044కు చేరింది. పాజిటివ్ కేసులతోపాటు మరణాలు కూడా అదేస్థాయిలో పెరుగుతుండటం అటు అధికారులు, ఇంటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొద్ది రోజుల క్రితం వరకు రోజుకు 10 మంది లోపే ఉన్న కరోనా మరణాల సంఖ్య ఇప్పుడు 40 వరకు కరోనా వరకు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంట్లో రాష్ట్రంలో 40 మరణాలు సంభవిచాయి. తూర్పుగోదావరి 8, ప్రకాశం 8, చిత్తూరు 5, కడప 4, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 493కి చేరింది.
ఇక ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,159 ఉండగా, కరోనా నుంచి కోలుకుంటున్న వారి 19,393కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 22, 304 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా రాష్ట్రంలో ఇప్పటివరకు 12, 40, 267 కరోనా టెస్టులు చేశారు.