ఏపీలో త్వరలో అందుబాటులోకి 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని డిప్యూటీ సీఎం ఆళ్లనాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 27 ప్రభుత్వ మెడికల్

  • Published By: naveen ,Published On : June 4, 2020 / 07:35 AM IST
ఏపీలో త్వరలో అందుబాటులోకి 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

Updated On : June 4, 2020 / 7:35 AM IST

రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని డిప్యూటీ సీఎం ఆళ్లనాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 27 ప్రభుత్వ మెడికల్

రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని డిప్యూటీ సీఎం ఆళ్లనాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు. 24 గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలనేది సీఎం జగన్‌ ఆశయమని చెప్పారు. అనకాపల్లి గవర్నమెంట్ ఆ​స్పత్రిలో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు మెరుగైన వైద్య సదుపాయంతో పాటు పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1060 అంబులెన్స్‌ వాహనాలు జూలైలో అన్ని మండలాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించడానికి రూ.16వేల కోట్లు కేటాయించామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. 

అనకాపల్లి ప్రాంతంలో మెడికల్‌ కాలేజీ:
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం కోడూరు, గొలగాం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. పాదయాత్ర సమయంలో అనకాపల్లి ప్రాంతంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తానని జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మెడికల్‌ కాలేజీని మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం ఆళ్లనాని చెప్పారు. అదే విధంగా అనకాపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల కోసం ఇంత శ్రద్ధ చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. త్వరలోనే టెండర్లు ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పించారని మంత్రి తెలిపారు.

Read: చెక్ చేసుకోండి, వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు వేసిన జగన్ ప్రభుత్వం