స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా అమరావతి రాజధానిలోని 29 గ్రామాలు
అమరావతి రాజధానిలోని 29 గ్రామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహనను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీని కోరింది.

అమరావతి రాజధానిలోని 29 గ్రామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహనను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీని కోరింది.
అమరావతి రాజధానిలోని 29 గ్రామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీని కోరింది. పంచాయతీలను కార్పొరేషన్‌లలో విలీనం చేసినందుకు ఎన్నికలు నిలిపివేయాలని చెప్పింది. అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. ఆయా గ్రామాల్లో పంచాయతీ, పరిషత్ ఎన్నికలు నిర్వహించవద్దని ఏపీ ప్రభుత్వం ఈసీని కోరింది.
అమరావతి సిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ఇంతకముందే ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నిలిపివేయాలని అప్పట్లో కోర్టులో రైతులు కేసులు వేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రైతులు దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. సీర్డీఏ చట్టం రద్దు చేయకుండా ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తారని రాజధాని ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమరావతి సిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు దిశగానే ముందుకు వెళ్తోంది. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
ఈ పరిణామంపై రాజధాని ప్రాంతం రైతులు తీవ్రమైన ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటును వ్యతిరేకించారు. ఇదే విషయంపై కోర్టుకు వెళ్లారు. రాష్ట్రంలో తమకు సీర్డీఏ చట్టం ఉంది కనుక.. ఆ చట్టాన్నే అమలు చేయాలని రాజధాని ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.