3 రాజధానుల బిల్లు : TDP సభ్యుల సస్పెన్షన్

మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. ప్రతిపక్ష సభ్యులు, అధికారపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. అంతకంటే ముందు..బాబు సుదీర్ఘంగా మాట్లాడడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనంతరం బాబు మైక్‌ను కట్ చేశారు స్పీకర్. దీంతో సీఎం జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ..పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. మార్షల్ పిలిచి సభ్యులను బయటకు పంపించాలని సీఎం జగన్ సూచించారు. ఏపీ మంత్రి బుగ్గన మార్షల్‌ను పిలిపించారు. మూడు రాజధానులు వద్దు..అమరావతే ముద్దు..అంటూ నినాదాలు చేశారు. ఆందోళన సద్దుమణగకపోవడంతో వారిని 17 మంది సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
సస్పెన్షన్ అయిన వారు :-
అచ్చెన్నాయుడు, కరణం బలరాం, నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చిన రాజప్ప, వెంకటిరెడ్డి నాయుడు, వాసుపల్లి గణేశ్, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి, మంతెన రామరాజు, బాల వీరాంజనేయ స్వామి.
టీడీపి చేస్తున్న ఆందోళనను వైసీపీ సభ్యులు ఖండించారు. సీఎం జగన్ ప్రసంగం ప్రజలకు తెలియకుండా నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు మంది టీడీపీ సభ్యులు మాట్లాడారని, బాబు గంటన్నరసేపు మాట్లాడారనే విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలుంటే..కేవలం 7 మంది సభ్యులు మాత్రమే మాట్లాడరని తెలిపారు. సభలో జరిగిన దానిపై బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అనీల్.
2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు.
Read More : పెద్దాయన (బాబు)కు ఎంత టైం – సీఎం జగన్..సార్..టైం ఇవ్వాలి..బాబు