ఏపీలో తగ్గని కరోనా కేసులు.. 3వేలు దాటిన మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎంతమాత్రం తగ్గడం లేదు.. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా మరణాలు 3 వేలు దాటేశాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 55, 551 శాంపిల్స్ పరీక్షించగా 9,393 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు.
కోవిడ్ వల్ల చిత్తూరులో పదహారు మంది, ప్రకాశంలో పదకొండు మంది, నెల్లూరులో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, తూర్పు గోదావరిలో ఎనిమిది మంది, పశ్చిమ గోదావరిలో ఎనిమిది మంది, కడపలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణలో ఇద్దరు మరణించారు.
గడిచిన 24 గంటల్లో 8,846 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ ఏపీలో 30,74, 847 శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో 87, 177 యాక్టివ్ కేసులు ఉంటే.. ఇప్పటివరకూ 2,35,218 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1357, పశ్చిమగోదావరిలో 995 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. విశాఖలో 985, అనంతలో 973, చిత్తూరులో 836 కరోనా కేసులు నమోదయ్యాయి.