AP Corona Cases : ఏపీలో కొత్తగా 3,166 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో  కొత్తగా 3,166 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 21 మంది మృతి చెందారు.

AP Corona Cases : ఏపీలో కొత్తగా 3,166 కరోనా కేసులు

3,166 New Corona Cases Were Reported In The Ap

Updated On : July 7, 2021 / 9:06 PM IST

AP corona cases : ఆంధ్రప్రదేశ్ లో  కొత్తగా 3,166 కరోనా కేసులు నమోదయ్యాయి. 83,885 శాంపిల్స్ ను పరీక్షించగా వీటిలో 3,166 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 21 మంది మృతి చెందారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఏపీలో 4,019 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 19,08,336కు చేరింది. వీటిలో 32,356 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తూర్పుగోదావరి, చిత్తూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, పశ్చిమగోదావరి, అనంతపురంలో ఇద్దరు, విశాఖ, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.