యూకే నుంచి వచ్చిన వారితో శ్రీకాకుళం జిల్లాలో కలకలం

యూకే నుంచి వచ్చిన వారితో శ్రీకాకుళం జిల్లాలో కలకలం

Updated On : December 26, 2020 / 7:40 PM IST

33 people came to Srikakulam from the UK : శ్రీకాకుళం జిల్లాలో యూకే నుంచి వచ్చిన వారితో కలకలం మొదలైంది. బ్రిటన్‌లో కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో శ్రీకాకుళం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నవంబర్ 25 నుంచి ఇప్పటివరకూ యూకే నుంచి 33 మంది జిల్లాకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ రెండ్రోజుల క్రితం కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్ పరీక్షలో వీరఘట్టం మండలానికి చెందిన ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది.

దీంతో శ్రీకాకుళంలోని కోవిడ్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అయితే అక్కడ ఆమెకు RTPCR పరీక్ష నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. డిసెంబర్ 9న ఆమె యూకే నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్ వచ్చింది. అక్కడి నుంచి డిసెంబర్ 10న గోదావరి ట్రైన్‌లో విశాఖ చేరుకుంది. అక్కడి నుంచి వీరఘట్టానికి కారులో వెళ్లింది. పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా ఆమెను జెమ్స్ ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాక.. ఆమె నివాసముండే బీసీ కాలనీని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌కు ఏర్పాట్లు మొదలయ్యాయి. కేంద్రం సూచనకు తగ్గట్టుగా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 28న కృష్ణా జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ మొదలుకానుంది. డ్రై రన్ కోసం కృష్ణా జిల్లా యంత్రాంగాన్ని వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. ఇందుకోసం జిల్లాలోని ఐదు పోలింగ్ బూత్‌లను ప్రభుత్వం ఎంపిక చేసింది. మొత్తం 33వేల మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.