బాబుది అవాస్తవం : అర్హులకు ఫించన్లు..4.16 లక్షల మంది అనర్హులు – బొత్స

  • Published By: madhu ,Published On : February 7, 2020 / 09:08 AM IST
బాబుది అవాస్తవం : అర్హులకు ఫించన్లు..4.16 లక్షల మంది అనర్హులు – బొత్స

Updated On : February 7, 2020 / 9:08 AM IST

7 లక్షల పెన్షన్లు తొలగించామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అర్హులైన అందరికీ ఫించన్లు అందుతున్నట్లు వెల్లడించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. కొత్తగా ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని స్పష్టం చేశారు. పాత వారిలో 4.16 లక్షల మందిని అనర్హులుగా గుర్తించామని, మరోసారి పరిశీలించి పెన్షన్‌కు అర్హులైతే తిరిగి ఇస్తామన్నారు.

300 యూనిట్లకు మించి కరెంటు బిల్లు ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించామన్నారు. 2020, జనవరి 07వ తేదీ శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

ఫించన్ల పంపిణీలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అధికారం కోల్పోయి అసహనంతో బాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, పెట్టబడులు రాకూడదు..యువతకు ఉపాధి, అవకాశాలు రాకూడదనే ఉద్దేశ్యంతో టీడీపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. 

రాష్ట్రంలో 7 లక్షల మందికి ఫించన్లు తొలగించడం అన్యాయమంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మండలాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు బాబు.