AP Covid Updates: ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్త‌గా 7,796 కేసులు

ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,796 కరోనా కేసులు నమోదు కాగా.. 77 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 89,732 మంది శాంపిల్స్ పరీక్షించగా 7,796మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

AP Covid Updates: ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్త‌గా 7,796 కేసులు

Ap Covid Updates

Updated On : June 8, 2021 / 9:18 PM IST

AP Covid Updates : ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,796 కరోనా కేసులు నమోదు కాగా.. 77 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 89,732 మంది శాంపిల్స్ పరీక్షించగా 7,796మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్ కేసులు ఉండగా.. 11,629 మంది మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,71,007కి చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,629కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కొవిడ్ బారినపడి విజయనగరం 5, ప్రకాశం 7, గుంటూరు 4, కర్నూలు 3, నెల్లూరు 8, కృష్ణ 2, అనంతపురం 8, తూర్పుగోదావరి 6, చిత్తూరు 12, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 10, ప్రకాశం 4, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు. కరోనా నుంచి 14,641 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 16,51,790కి చేరింది.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కరోనాతో 12 మంది మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,302 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 89,732 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,99,46,253కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని పలు ఆస్పత్రుల్లో 1,07,588 మంది చికిత్స పొందుతున్నారు.