Visakha Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ

సంఘం - శరత్ థియేటర్ దగ్గర 7:30 ప్రాంతంలో లారీని ఆటో ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

Visakha Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ

Vizag School Auto Accident

Visakha School Auto Incident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. పలువురు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘం – శరత్ థియేటర్ దగ్గర 7:30 ప్రాంతంలో లారీని ఆటో ఢీకొట్టింది. క్లీనర్ డ్రైవ్ చేస్తుండటంతో లారీ ఒక్కసారిగా వచ్చి స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో పలువురు పిల్లలకు గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డుకు ఇరువైపులు పిల్లలు పడిపోయారు. ప్రమాద ఘటన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.

ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయని డీసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఎనిమిది మంది విద్యార్థులను సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆటో డ్రైవర్ కూడా గాయపడ్డాడని అతన్ని కేజీహెచ్ కు తరలించామని పేర్కొన్నారు. లారీని క్లీనర్ డ్రైవింగ్ చేస్తున్నాడా అన్న కోణంలో విచారిస్తున్నామని పేర్కొన్నారు. పిల్లలు చికిత్స పొందుతున్న ఆస్పత్రి దగ్గరకు వారి తల్లిదండ్రులు చేరుకుని బోరున విలపిస్తున్నారు.

పారి పోయేందుకు ప్రయత్నించిన లారీ, డ్రైవర్, క్లీనర్, ఆటో డ్రైవర్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా,  ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉదయం 10 గంటల వరకు భారీ వాహనాలకు అనుమతి లేదు. కానీ, ఆ సమయంలో లారీ అక్కడకు ఎలా అనుమితించారన్న దానిపై విశాఖ టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident : విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిన నలుగురు యువకులు

మరో స్కూల్ ఆటో బోల్తా
విశాఖలోని మధురవాడ నగరం పాలెం రోడ్డులో మరో స్కూల్ ఆటో బోల్తా పడింది. ఈ ఆటోలో ఏడుగురు స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నారు. పలువురు పిల్లలకు, ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన పిల్లలను, ఆటో డ్రైవర్ ను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పంది అడ్డురావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి

మంత్రి అమర్నాథ్ పరామర్శ
రోడ్డు ప్రమాదంలో గాయపడి సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు.