Young Man Harassing : సోషల్ మీడియాలో యువకుడు వేధింపులు.. ప.గో నుంచి కర్నూలుకు వచ్చి చెప్పుతో చితక్కొట్టిన యువతి

కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో యువతిని షాన్‌వాజ్ వేధిస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన యువతి.. యువకుడితో పరిచయం పెంచుకొని అడ్రస్‌ కనుక్కుంది.

Young Man Harassing : సోషల్ మీడియాలో యువకుడు వేధింపులు.. ప.గో నుంచి కర్నూలుకు వచ్చి చెప్పుతో చితక్కొట్టిన యువతి

Attack (1)

Updated On : May 4, 2022 / 6:50 PM IST

young man harassing : సోషల్‌ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెట్టాడని యువకుడిని యువతి ఓ ఆటాడుకుంది. కర్నూలు జిల్లాలో యువకుడిని యువతి చితకబాదింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి.. కర్నూలు జిల్లా ఆలూరుకు వచ్చి మరీ యువకుడికి దేహశుద్ధి చేసింది. కొన్నాళ్ల క్రితం ఆమె సోషల్‌మీడియా వాల్‌పై ఆలూరుకు చెందిన షాన్‌వాజ్‌ అనే వ్యక్తి అసభ్యకర కామెంట్లు పెట్టాడు.

కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో యువతిని షాన్‌వాజ్ వేధిస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన యువతి.. యువకుడితో పరిచయం పెంచుకొని అడ్రస్‌ కనుక్కుంది. కలుద్దామని చెప్పి పశ్చిమగోదావరి జిల్లా నుంచి కర్నూలు జిల్లాలోని యువకుడి సొంతూరు ఆలూరుకు వచ్చింది.

Harassment For Videos : స్నేహితుడు కాదు కామాంధుడు.. న్యూడ్ వీడియోలు పంపాలని యువతికి వేధింపులు

వచ్చీ రాగానే.. చెప్పు అందుకొని.. షాన్‌వాజ్‌ను చితకబాదింది. ఆడవాళ్లంటే అంత చులకనా అంటూ చెప్పుతో కొట్టింది. అడ్డుకోబోయిన యువకుడి కుటుంబసభ్యులకు కూడా చెప్పుదెబ్బలు తప్పలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చినా.. యువతి చెప్పుదెబ్బలు మాత్రం ఆపలేదు.