Chandrababu Custody Petition : చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ
క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాలేదు కాబట్టి కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

Chandrababu custody petition
Chandrababu Custody Petition – ACB Court : టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఇవాళ (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే ఇది రిజర్వ్ తీర్వు కాబట్టి ఇవాళైనా తీర్పు ఇవ్వొచ్చు లేదా సోమవారం అయినా ఇవ్వొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో అందరిలో ఉత్కంఠ కొనసాగుతోంది.
చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై బుధవారమే వాదనలు ముగిశాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మరిన్ని విషయాలను వెలికి తీసేందుకు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాది కోరగా సిట్ కార్యాలయంలో ఇప్పటికే విచారణ జరిపారని, రాజకీయ కక్ష పూరిత కేసు కాబట్టి కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మొదట గురువారం ఉదయానికి వాయిదా వేశారు.
YS Jagan Mohan Reddy : జైల్లో చంద్రబాబు.. మరోసారి సీఎం అయ్యేందుకు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి
ఆ తర్వాత దానిని సాయంత్రం 4 గంటలకు మార్చారు. సాయంత్రం కూడా తీర్పును వెలువరించలేదు. మరోసారి తీర్పు వాయిదా పడింది. ఇవాళ తీర్పు చెబుతామని న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు క్వాష్ తీర్పు హైకోర్టులో ఉన్న దృష్ట్యా కస్టడీ పిటిషన్ పై తీర్పును న్యాయమూర్తి వాయిదా వేశారు. హైకోర్టులో ఇవాళ క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే తీర్పు వాయిదా వేస్తానని చెప్పారు.
క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాలేదు కాబట్టి కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి.