సంక్రాంతి తర్వాతే : రాజధానిపై హైపవర్ కమిటీ ఏం తేలుస్తుంది?

రాజధానిని తరలిస్తారా ? రాజధాని రైతుల ఆందోళనపై స్పందిస్తుందా ? 29 గ్రామాలకు చెందిన రైతులపై వరాలు కురిపిస్తారా ? భరోసా కల్పించేలా ప్రకటన ఉంటుందా ? రైతుల డిమాండ్ ప్రభుత్వం పట్టించుకుంటుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం వస్తుందని ఆశించారు. ఎందుకంటే..డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు రాజధానులు, జీఎన్ రావు కమిటీ నివేదిపై ప్రధానంగా చర్చించారు.
కీలక ప్రకటన వెలువడుతుందని ఆశించారు. అయితే..రాజధాని తరలింపుపై హై పవర్ కమిటీ వేయాలని, మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ సూచించింది. ఈ కమిటీలో ఏడుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండనున్నారు. ఏపీ మంత్రిమండలి సమావేశం ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ప్రభుత్వానికి GN RAO కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కమిటీ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై 10tvలో చర్చ జరిగింది.
ఇప్పటికే రాజధాని ప్రాంత విషయంలో కమిటీలు వేశారని, మరలా ఇప్పుడు మరో కమిటీ వేయడంపై భిన్నమైన స్పందనలు వ్యక్తమౌతున్నాయి. రాజధాని రైతుల విషయంలో ప్రకటన వస్తుందని ఆశించారని, కానీ అలా జరగలేదని విశ్లేషకులు తెలకపల్లి వెల్లడిస్తున్నారు. రాజకీయ సమస్యలు కనిపిస్తున్నాయని, అమరావతిని తరలించడం లేదంటున్నారని..విశాఖకు తరలిస్తారనే మరో ప్రచారానిక ితెరతీశారని విమర్శిస్తున్నారు.
రాజధాని అమరావతిలో ఉండాలని, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని భావిస్తోంది టీడీపీ. విశాఖపట్టణంలో అన్నీ అవకాశాలున్నాయని అంటున్నారని, కానీ అమరావతిలో అన్నీ అవకాశాలున్నాయని అంటున్నారు టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు. జగన్ తుగ్లక్ పాలన చేస్తున్నారని విమర్శించారు.
దీనిని ఖండించారు వైసీపీ నేత రాజశేఖర్. సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుందన్నారు. టీడీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజధాని ప్రాంతాల వాసులను భ్రమ పెట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు న్యాయం చేస్తుందని మరోసారి హామీనిచ్చారు. ప్రజాస్వామ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటారని, ఒక స్టేజ్ పూర్తయిందని..బోస్టన్ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యం తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.
* మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికతో అమరావతి ప్రాంతంలో కాక రాజేసింది.
* రాజధానులు తరలించవద్దంటూ ఆందోళనలు మిన్నంటాయి.
* విశాఖలో రాజధాని పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
* డిసెంబర్ 28వ తేదీన సీఎం జగన్ విశాఖలో పర్యటన, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
* ప్రస్తుతం హై పవర్ కమిటీ ఏం తేల్చనుందో ? ఎలాంటి నివేదిక ఇవ్వనుందోననే దానిపై ఉత్కంఠ నెలకొంది.
* ఈ కమిటీ 29 గ్రామాల్లో పర్యటించి..ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటారని సమాచారం.
* జనవరి 20 తరవాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.