AIG Hospitals Vizag: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. విశాఖలో రూ. 2000 కోట్లతో ఏఐజీ హాస్పిటల్.. శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ ఏఐజీ ఆస్పత్రి (AIG Hospitals Vizag) సిద్ధమైంది.
Aig hospitals visakhapatnam nara lokesh foundation stone lay
- విశాఖలో ఏఐజీ ఆస్పత్రి శంకుస్థాపన
- తొమ్మిది వేల మందికి కొత్త ఉద్యోగాలు
- అంతర్జాతీయ స్థాయి వైద్య సేవల లభ్యత
AIG Hospitals Vizag: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ ఏఐజీ ఆస్పత్రి (AIG Hospitals Vizag) సిద్ధమైంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఈ భారీ హెల్త్‌కేర్, అకడమిక్ అండ్ రీసెర్చ్ హబ్‌కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రేపు అనగా సోమవారం(ఆగస్టు 31) శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ. 2,000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 9,000 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వైద్యరంగంలో 30 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉన్న ఏఐజీ హాస్పిటల్స్ రాకతో ఉత్తరాంధ్ర వైద్య సౌకర్యాలలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
9 ఎకరాల్లో అత్యాధునిక క్యాంపస్ – 50కి పైగా ప్రత్యేక విభాగాలు:
విశాఖపట్నంలో 9 ఎకరాల వైశాల్యంలో ప్రధాన ఆస్పత్రి క్యాంపస్‌ను, అలాగే మరో 2.5 ఎకరాల్లో అధునాతన నర్సింగ్ కళాశాలను ఏఐజీ యాజమాన్యం నెలకొల్పుతోంది. ఈ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను (మల్టీ స్పెషాలిటీస్) అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యుత్తమ వైద్య నిపుణులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థానిక ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు తక్కువ ఖర్చులోనే లభించనున్నాయి.
