Alla Nani: ఆళ్ల నాని సైకిల్ సవారీకి లైన్ క్లియరైనట్టేనా?
ఇదే సమయంలో పార్టీ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలు ఎలాంటి వైనా సహకరించాలని చంద్రబాబు కోరినట్లు చర్చ జరుగుతోంది.

Alla Nani
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి టీడీపీ కండువా కప్పుకునేందుకు లైన్ క్లియర్ అయినట్లేనా.. అధినేత చంద్రబాబు నుంచి గ్రీస్ సిగ్నల్ వచ్చేసిందా.. నిజానికి ఆళ్ల నాని ఎప్పుడో వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. కానీ టీడీపీ లోకల్ లీడర్లు అబ్జక్షన్ చెప్పడంతో ఆయన చేరిక ఇన్నాళ్లు పెండింగ్‌లో పడింది. మరి ఇప్పుడు ఉన్నపళంగా గ్రీన్ సిగ్నల్ ఎలా వచ్చింది.. క్యాడర్ కామ్ డౌన్ అయ్యిందా.. లేదంటే బుజ్జగింపులు సక్సెస్ అయ్యాయా..?
వైసీపీ పవర్ పోయినప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు జంపింగ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. కానీ టీడీపీ ఎవరిని పడితే వారిని తీసుకోవడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని టార్గెట్ చేసిన వారిని పార్టీ కండువా కూడా టచ్ చేయనీయడం లేదు. జోగి రమేశ్ లాంటి నేతలు వస్తానంటున్న వద్దంటున్నారు.
అధిష్టానమే కాదు.. క్యాడర్ వద్దంటున్న చోట కూడా చేరికలో ఆగిపోతున్నాయి. కొన్నిచోట్ల ఎవరైన వైసీపీ నేత టీడీపీలోకి వస్తున్నారంటూ లీక్స్ వస్తే చాలు.. లోకల్ క్యాడర్ వద్దంటే వద్దంటూ అడ్డుకుంటున్నారు. ఇలా అందరి కంటే ముందే వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఆళ్లనాని చేరిక కూడా అలానే ఆగిపోయింది.
సైకిల్ ఎక్కేందుకు తెగ ట్రై
ఆళ్ల నాని వైసీపీని వీడిన నాటి నుంచి సైకిల్ ఎక్కేందుకు తెగ ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏలూరు లోకల్ లీడర్లు ఆళ్లనాని రాకను అడ్డుకున్నారట. గత ఐదేళ్లలో అధికారంలో ఉండి..ఆయన పెట్టిన బాధలు అన్నీఇన్నీ కావని.. తమను హింసించిన నేతను ఎలా తీసుకుంటారంటూ అధిష్టానం దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆయనతో కలిసి పనిచేయడం కష్టమని తేల్చిచెప్పారట.
ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఈ విషయంపై చంద్రబాబును కలిసి తన అభిప్రాయం చెప్పినట్లు టాక్. ఆళ్లనానీని పార్టీలో చేర్చుకునే విషయంలో మరోసారి ఆలోచించాలని..నానీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏలూరులో అక్రమ కేసులు పెట్టి టీడీపీ శ్రేణులను వేధించారని..వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని..చంద్రబాబుకు వివరించినట్లు చెబుతున్నారు. అఖరికి అచ్చెన్నాయుడు రంగంలోకి దిగి నచ్చచెప్పినా తెలుగు తమ్ముళ్లు వినలేదట.
అలా పెండింగ్‌లో పడిపోయిన ఆళ్ల నాని చేరిక.. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. బుధవారం ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇన్నాళ్లు ఆళ్ల నాని చేరికను పరోక్షంగా అడ్డుకున్న స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి కూడా దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం వచ్చిందన్నారు.
అన్ని దారులు క్లియర్?
అంటే ఆళ్ల నాని టీడీపీలోకి వచ్చేందుకు అన్ని దారులు క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. స్థానిక ఎమ్మెల్యే ఓకే చెప్పినా… క్యాడర్ మాత్రం అదే అసంతృప్తితో రగిలిపోతోంది. దీంతో ఆళ్ల నాని చేరిక సజావుగా ఉంటుందా.. ఉండదో అనే బిగ్ డిబెట్ పార్టీలో మొదలైంది.
గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆళ్లనాని.. టీడీపీ కార్యకర్తల ఇళ్లను సైతం కూలగొట్టించిన ఘటనలు ఉన్నాయని, ఆయన పార్టీలోకి రావడం వల్ల కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని..ఈ విషయంపై పునరాలోచన చేయాలని టీడీపీ అధిష్టానానికి స్థానిక క్యాడర్ రిక్వెస్ట్ చేస్తోంది.
ఇదే సమయంలో పార్టీ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలు ఎలాంటి వైనా సహకరించాలని చంద్రబాబు కోరినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు ఆదేశాలతో లోకల్ క్యాడర్ కామ్‌గా ఉన్నా.. ఫ్యూచర్‌లో ఆళ్ల నానికి ఎలా సహకరిస్తారన్నది బిగ్ డౌట్‌గా కనిపిస్తోంది.
కడప కార్పొరేషన్‌పై టీడీపీ గురి పెట్టిందా? జగన్ అడ్డాలో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి వీస్తుందా?