చిరంజీవిపై అమరావతి రైతులు ఫైర్ :సినిమాల్లో కాదు..నిజజీవితంలో పోరాడండి

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 07:15 AM IST
చిరంజీవిపై అమరావతి రైతులు ఫైర్ :సినిమాల్లో కాదు..నిజజీవితంలో పోరాడండి

Updated On : December 22, 2019 / 7:15 AM IST

ఏపీలో మూడు రాజధానుల విషయాన్ని స్వాగతిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి అనటంపై అమరావతి ప్రాంత రైతులు మండిపడుతున్నారు. మెగాస్టార్ కు రైతులతో పాటు వారికి మద్ధతుగా నిలిచిన విద్యార్ధులు కూడా కౌంటరిచ్చారు. చిరంజీవిగారూ..రైతు సమస్యలపై సినిమాల్లో నటించేయటం కాదు..నిజజీవితంలో పోరాడండి అంటూ కౌంటరిచ్చారు. 

మెగాస్టార్ చిరంజీవి సినిమాల నుంచి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయంలోకి వెళ్లారు. అలా వెళ్లిన చిరంజీవి పాలిటిక్స్ లో బోల్తా పడి పలు పరిణామాలతో తిరిగి సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చి ..‘‘ఖైదీ నంబర్ 150’’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి రైతుల కష్టాలపై పోరాడే వ్యక్తిగా  నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ‘నీరు..నీరు రైతు కంట నీరు’ అనే పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  చిరంజీవి తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.  ‘‘ఖైదీ నంబర్ 150’’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

ఈక్రమంలో ఏపీ సీఎం రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ప్రకటించటం..దానికి సంబంధించి జీఎన్ రావు కమిటీ నివేదిక అనుకూలంగా రావటంతో అమరావతి రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని రైతులు మండిపడుతున్నారు. అమరావతి వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ  క్రమంలో ఏపీకి మూడు రాజధానులు మంచిదే..మూడు రాజధానులతో ఏపీ డెవలప్ అవుతుంది అంటూ చిరింజీవి వ్యాఖ్యానించారు. దీంతో అమరాతి ప్రాంత రైతులు మండి పడుతూ..తమ భూముల్ని పోగొట్టుకుని బాధపడుతుంటే..చిరంజీవిగారు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో రైతుల గురించి నటించేయటం కాదు..నిజజీవితంలో కనీసం రైతుల కష్టాలను గురించి తెలుసుకుని మాట్లాడాలంటూ కౌంటర్లిస్తున్నారు.