రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: అంబటి రాంబాబు

అకాల వర్షాలకు పంట నష్టం తీవ్రంగా ఉందని చెప్పారు. పండిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని అన్నారు.

రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: అంబటి రాంబాబు

Updated On : December 10, 2024 / 4:09 PM IST

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రాల్లో రైతులకు మద్దతుగా వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. “అన్నదాతకు అండగా వైసీపీ రైతులను దగా చేస్తున్న కూటమి సర్కార్ పై నిరసన గళం” పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

అన్ని జిల్లాల కలెక్టర్లకు రైతులను ఆదుకోవాలని వినతి పత్రాలు ఇవ్వనుంది వైసీపీ. కార్యక్రమం పోస్టర్ ను వైసీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. అకాల వర్షాలకు పంట నష్టం తీవ్రంగా ఉందని చెప్పారు. పండిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని అన్నారు.

ప్రభుత్వం కొనుగోలు చెయ్యడం లేదని, దళారులు వచ్చేశారు తక్కువ ధరకు కొంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులను అనేకరకాలుగా ఇబ్బంది పెడుతుందని చెప్పారు. పండిన ధాన్యంలో పది శాతం కూడా ప్రభుత్వం కొనుగోలు చెయ్యడం లేదని అన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు.

Sajjala Ramakrishna Reddy: వారి గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దాం: సజ్జల