Ambati Rambabu: అందుకే చంద్రబాబు తనకు ఆరోగ్యం బాగోలేదని అంటున్నారు: మంత్రి అంబటి

రాజకీయాలకు పవన్ కల్యాణ్ ఆన్ ఫిట్ అని అంబటి రాంబాబు విమర్శించారు.

Ambati Rambabu: అందుకే చంద్రబాబు తనకు ఆరోగ్యం బాగోలేదని అంటున్నారు: మంత్రి అంబటి

Minister Ambati Rambabu

Updated On : October 19, 2023 / 4:27 PM IST

Skill development case: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో ఆరోగ్యంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని చంద్రబాబు సింపతీ కోసమే డైలాగ్స్ కొడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఇవాళ అమరావతిలో చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీంపతీ రాజకీయాలు వర్క్ ఔట్ అయ్యే రోజులు ఇప్పుడు లేవని చెప్పారు. జైలులో చంద్రబాబు సెక్యూరిటీకి ఎలాంటి డోకా లేదని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు చాలా పెద్దదని, చంద్రబాబు నాయుడు స్కామ్ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

చంద్రబాబు భార్య భువనేశ్వరి నిజం గెలవాలని అంటున్నారని అంబటి అన్నారు. అలాగే, నారా లోకేశ్ భవిష్యత్ గ్యారంటే అంటూ కార్యక్రమాలు చేస్తామంటున్నారని చెప్పారు. తాము కూడా నిజం గెలవాలనే అంటున్నామని తెలిపారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చారని చెప్పారు.

చంద్రబాబు అరెస్ట్ తో నిజం గెలుస్తోందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో 100 మంది చనిపోయారని అంటున్నారని చెప్పారు. నిజంగా చంద్రబాబు కోసం అంతమంది చనిపోయే అంత సీన్ ఉందా అని నిలదీశారు. చంద్రబాబు అరెస్టుతో చాలా మంది ఆత్మలు శాంతిస్తున్నాయని చెప్పారు.

ఎన్టీఆర్ దగ్గరి నుంచి రంగా వరకు, గోదావరి పుష్కరాల్లో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయని అన్నారు. టీడీపీ భవిష్యత్ కు గ్యారంటీ లేదని చెప్పారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ బీజేపీతోనే ఉన్నానని చెబుతున్నారని, ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్నానని అంటున్నారని తెలిపారు. అక్కడ టీడీపీతో పొత్తుపై, ఏపీలో బీజేపీతో పొత్తుపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. పవన్ రాజకీయాలకు ఆన్ ఫిట్ అని విమర్శించారు.

Governor Indrasena Reddy : నాకు గవర్నర్ పదవి రావటం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు : ఇంద్రసేనారెడ్డి