Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి : పవన్ కళ్యాణ్

వైసీపీ అపసవ్య పాలన వల్లే కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోందన్నారు.

Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి : పవన్ కళ్యాణ్

Pawan Kalyan (2)

Updated On : May 8, 2022 / 4:41 PM IST

Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకోసం ఎవరెవరు కలిసొస్తారో చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రానికి నష్టం కలుగుతుందన్నారు. తన వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు.

ఏపీ భవిష్యత్ కోసం చాలా మంది కలిసి పని చేయాలని తెలిపారు. డైరెక్ట్ గా చెప్పినప్పుడు చంద్రబాబు ప్రస్తావనపై ఆలోచిద్దామని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు ఉండాలన్నారు. ప్రజల పక్షాన ఉండేందుకు తాను పొత్తుల నుంచి బయటికొస్తానని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలుంటే పాలన ఎలా ఉండాలని ప్రశ్నించారు.

Pawan Kalyan : కౌలు రైతుల సమస్యల్ని వైసీపీ ప్రభుత్వం గుర్తించట్లేదు : పవన్ కళ్యాణ్

వైసీపీ అపసవ్య పాలన వల్లే కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోందన్నారు. ఉద్యోగాలు, పరిశ్రమలు లేవని విమర్శించారు. రైతులను ఆదుకునేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆదుకుని ఉంటే తాము భరోసాయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు.