Pawan Kalyan : కౌలు రైతుల సమస్యల్ని వైసీపీ ప్రభుత్వం గుర్తించట్లేదు : పవన్ కళ్యాణ్

వైసీపీ అంటే నాకు ద్వేషం లేదన్నారు. కన్నీళ్లు తుడుస్తానని చెప్పి చేయకపోతే గట్టిగా అడుగుతామన్నారు. ప్రజల కన్నీళ్లు తుడవకపోతే గ్రామ సచివాలయాలు ఎందుకు అన్నారు.

Pawan Kalyan : కౌలు రైతుల సమస్యల్ని వైసీపీ ప్రభుత్వం గుర్తించట్లేదు : పవన్ కళ్యాణ్

Pawan Kalyan (1)

Janasena Pawan Kalyan : ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. కౌలు రైతుల సమస్యల్ని వైసీపీ ప్రభుత్వం గుర్తించట్లేదన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటే మేం రోడ్డుపైకి వచ్చేవారం కాదన్నారు. దేశంలో 80శాతం వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కౌలు రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు.

వైసీపీ అంటే నాకు ద్వేషం లేదన్నారు. కన్నీళ్లు తుడుస్తానని చెప్పి చేయకపోతే గట్టిగా అడుగుతామన్నారు. ప్రజల కన్నీళ్లు తుడవకపోతే గ్రామ సచివాలయాలు ఎందుకు అన్నారు. జనసేన ప్రశ్నిస్తే తప్ప సమస్యలు తెలియవా అని అన్నారు. తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ దూషించనని స్పష్టం చేశారు. చంచల్ గూడలో షటిల్ ఆడుకున్న మీరు మాకు చెప్తారా అని అన్నారు.

Pawan Kalyan in Anantapur: రైతుల కన్నీళ్లు కష్టాలు తీర్చలేనప్పుడు ఈప్రభుత్వాలు ఎందుకు: పవన్ కళ్యాణ్

ప్రశ్నిస్తే నన్ను దత్తపుత్రుడు అంటారా? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కాబట్టి మీరు అనే మాట్లాడుతున్నా..ఇంకోసారి దత్తపుత్రుడు అని అంటే.. సీబీఐకి దత్తపుత్రుడని అంటామని తెలిపారు. నేనెవ్వరికీ దత్తత వెళ్లను.. నన్నెవరూ భరించలేరని చెప్పారు.99 సార్లు శాంతియుతంగా ప్రవర్తిస్తానని, అలాగే విర్రవీగితే తాను ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసన్నారు. జనసేన సైనికుల మీద దాడులు చేస్తే.. మర్యాదగా ఉండదని హెచ్చరించారు.

ప్రజలు సమస్యలు తీర్చని గ్రామ సచివాలయాలు ఎందుకు ? జనసేన ఎత్తుకుంటే గానీ మీకు సమస్య గుర్తురాదా ? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు చనిపోయారని తెలిపారు. 80 శాతం కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించకపోయినా.. తమ పార్టీ గుర్తిస్తుందన్నారు. కౌలు రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ? అని ప్రశ్నించారు. సమస్యలపై మాట్లాడితే.. తనను దత్తపుత్రుడు అని అంటున్నారని పేర్కొన్నారు. సీబీఐ దత్తపుత్రుడు మాట్లాడే మాటలను పట్టించుకోవాల్సినవసరం లేదన్నారు. దత్తత అని ఎందుకు వస్తుంది ? అని సెటైర్ వేశారు.

Pawan Kalyan : విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణం : పవన్ కళ్యాణ్

దత్తత తీసుకుని భరించలేకపోయారని, ఈ విషయాలను పక్కకు పెట్టి సమస్యలను పరిష్కరించాలన్నారు. పాలసీ, ప్రజల కష్టాలపై మాట్లాడుతాను.. వ్యక్తిగతంగా దూషించనని మరోసారి చెప్పారు. సీఎం స్థానాన్ని గౌరవిస్తూ.. మాట్లాడుతానని తెలిపారు. నరసాపురం ఎంపీ కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పారు. చంచల్ గూడ షటిల్ టీం అని చెబుతామని ఎద్దేవా చేశారు. అక్కడ షటిల్ ఆడుకుని తమకు చెబుతారా ? రాజకీయాల్లో సెటైర్లు ప్రజలకు పనికొచ్చే విధంగా ఉండాలని సూచించారు.