Padmavathi Express: ఆంధ్రప్రదేశ్‌లో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ బోగీ.. సికింద్రాబాద్ వెళ్లే 2 రైళ్ల వేళల్లో మార్పులు

అనంతరం అక్కడ రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు.

Padmavathi Express: ఆంధ్రప్రదేశ్‌లో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ బోగీ.. సికింద్రాబాద్ వెళ్లే 2 రైళ్ల వేళల్లో మార్పులు

Padmavathi Express

Updated On : July 19, 2023 / 7:27 PM IST

Padmavathi Express- Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి (Tirupati) స్టేషన్ యార్డులో ఇవాళ సాయంత్రం పద్మావతి ఎక్స్‌ప్రెస్ బోగీ పట్టాలు తప్పింది. ఆ ఎక్స్‌ప్రెస్ బోగీలో ప్రయాణికులు ఎవరూ లేరు. ట్రైనుకి కోచ్‌లను అనుసంధానం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అనంతరం అక్కడ రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు. షంటింగ్ చేస్తుండగా పద్మావతి ఎక్స్‌ప్రెస్ బోగీ పట్టాలు తప్పిందని వివరించారు. ఈ ఘటనతో రెండు రైళ్ల వేళలను మార్చుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్ వెళ్లాల్సినవేనని తెలిపారు.

పద్మావతి ఎక్స్‌ప్రెస్ తో పాటు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ను రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు చెప్పారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్ ను రాత్రి 7.45 గంటలకు, అలాగే, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ను రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు వివరించారు.

Russia : నది నుంచి ఆకాశం వరకూ.. బంగారు రంగులో నీటి ధార.. అమేజింగ్ వీడియో వైరల్