Andhra pradesh : ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ భేటీ..
ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తిక భేటీ చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు.

Brother Anil Kumar Meets Undavalli Arun Kumar
brother anil kumar meets undavalli arun kumar : ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తిక భేటీ చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు. రాజమండ్రిలో ఉండవలి నివాసంలో బద్రర్ అనిల్ కుమార్ కలిసారు. కాసేపు ఇద్దరు పలు విషయాల గురిచి ముచ్చటించుకున్నారు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి అల్లుడు, ఏపీ సీఎం బావమరిది, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల భర్త ముఖ్యంగా ..దైవజనుడిగా పేరొందిన బ్రదర్ అనిల్ కుమార్ కు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధాలు లేకపోయినా..ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉండవల్లితో భేటీ అయిన సందర్బంగా బ్రదర్ అనిల్ మాట్లాడుతూ..అరుణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగానే కలిశానని తెలిపారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్. కుటుంబ పరంగాను..రాజకీయ పరంగాను చక్కటి సలహాలు ఇచ్చే శ్రేయోభిలాషి అని తెలిపారు. ఆయనతో మాట్లాడుతుండా..ఏపీ,తెలంగాణ రాజకీయాల గురించి పలు అంశాలు చర్చకు వచ్చాయని..పార్టీ పరంగాను..కుటుంబ పరంగాను ఉండవలి మంచి సలహాలు ఇచ్చారని బ్రదర్అనిల్ కుమార్ తెలిపారు. ఈ భేటీ అనంతరం ఉండవలి బ్రదర్ అనిల్ కుమార్ కు ఏపీ విభజన కథ పుస్తకాన్ని ఇచ్చారు.
కాగా..వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీంతో రాజకీయాలపై చర్చించేందుకు ఉండవల్లితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారని..ఇంకా పలు కీలక అంశాలు గురించి వారు చర్చించినట్లుగా సమాచారం.