Andra pradesh : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడితో సహా ఏడుగురిపై కేసు నమోదు

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడితో సహా పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

Andra pradesh : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడితో సహా ఏడుగురిపై కేసు నమోదు

Case Against Ayyanna Patrudu And His Son

Updated On : April 18, 2022 / 10:30 AM IST

Case Against Ayyanna Patrudu and his son :  ప్రభుత్వాన్ని ప్రశ్నించినా..విమర్శించినా కేసులు పెట్టటం..అరెస్టులు చేయటం ఏపీలో సర్వసాధారణంగా మారిపోయింది.దీంట్లో భాగంగానే మాజీ మంత్రి, ఆయన కుమారుడుతో సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, కౌన్సిలర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు చిన్నకుమారుడు రాజేశ్‌తోపాటు మరో ఏడుగురిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మరిడి మహాలక్ష్మి జాతర సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 15,2022) రాత్రి నర్సీపట్నం అబీద్ సెంటర్‌లోని జీసీసీ పెట్రోలు బంకు సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్ద పోలీసుల విధులకు అయ్యన్న, ఆయన కుమారుడు ఆటంకం కలిగించారని పోలీసులను దుర్భాషలాడారని అంతేకాకుండా పోలీసులకు అవమానించేలా వ్యవమరించారనే నేరం మోపి అయ్యన్న, వారి కుమారుడితో సహా మొత్తం ఏడగురుపై పోలీసులు అయ్యన్న, ఆయన కుమారుడు రాజేశ్‌తోపాటు మరో ఏడుగురిపై శనివారం (ఏప్రిల్ 16,2022) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.