ఎమ్మెల్యేలలో కలవరం.. వైసీపీ థర్డ్ లిస్ట్ రెడీ..! 29 స్థానాల్లో మార్పులు, చేర్పులు..!
ముఖ్యంగా నెల్లూరు, ఒంగోలుతో పాటు గుంటూరులోని రెండు నియోజకవర్గాలు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాలు, విశాఖ, విజయనగరం వంటి ప్రధానమైన ఎంపీ సెగ్మెంట్లపై సీఎం జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారు.

YCP Third List Ready
YCP Third List : వైసీపీ ఇంఛార్జిల మార్పులు చేర్పులకు సంబంధించిన మూడో జాబితా రాత్రికి విడుదల కానుంది. థర్డ్ లిస్ట్ ను అధిష్టానం రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే 29 స్థానాల్లో మార్పులు చేర్పుల జాబితా రెడీ అయ్యింది. జాబితాపై సీఎం జగన్ కసరత్తు చివరి దశకు చేరుకుంది.
వైసీపీ ఇంఛార్జిల మార్పులకు సంబంధించిన కసరత్తు చాలా సీరియస్ గా సీఎం జగన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేశారు. మొత్తం 38 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు మరో 29 స్థానాలకు సంబంధించిన మార్పులు రాత్రి ప్రకటించబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తు పూర్తైనట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి 29 స్థానాల్లో ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గత నాలుగు రోజులుగా సీఎం జగన్ ఎంపీ సెగ్మెంట్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
Also Read : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్
ముఖ్యంగా నెల్లూరు, ఒంగోలుతో పాటు గుంటూరులోని రెండు నియోజకవర్గాలు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాలు, విశాఖ, విజయనగరం వంటి ప్రధానమైన ఎంపీ సెగ్మెంట్లపై సీఎం జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా అమలాపురానికి సంబంధించి రాజమండ్రి, కాకినాడకు సంబంధించి ఇవాళ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
29 స్థానాల్లో మార్పులకు సంబంధించి కసరత్తు పూర్తి చేసిన జగన్, జాబితాను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. రాత్రికి జాబితాను ప్రకటించబోతున్నారు. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్. అయితే మొదటి జాబితాలో ఎక్కడా కూడా ఎంపీ స్థానాలు ప్రకటించ లేదు జగన్. రెండో జాబితాలో మాత్రం మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు. ఇక మూడో జాబితాలో మొత్తం 29 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.
Also Read : విజయవాడలో అన్నదమ్ముల పోటీ.. తమ్ముడిపై కేశినేని నాని పోటీ చేస్తారా?
ఇందులో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 10 ఎంపీ స్థానాలకు సంబంధించి మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. ఎవరినైతే మార్చాల్సి వస్తుందో, ఎవరినైతే పూర్తిగా పక్కన పెట్టాల్సి వస్తుందో వారందరితోనూ సీఎం జగన్ నేరుగా మాట్లాడుతున్నారు. ఎందుకు స్థానం మార్చాలి వచ్చింది? ఎందుకు తప్పించాల్సి వచ్చింది? అనేది స్వయంగా జగనే వారికి వివరిస్తున్నారు. టికెట్ ఇవ్వనంత మాత్రాన పక్కన పెట్టేసినట్లు కాదని, భవిష్యత్తులో వారికి మంచి పదవులు ఉంటాయని జగన్ హామీ ఇస్తున్నారు.
Also Read : సంపదంతా వాళ్ల చేతుల్లోకే వెళ్తుంది..! ప్రస్తుత రాజకీయాలపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు