Former Minister Kutuhalamma Passed Away : మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత

మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. చిత్తూరు జిల్లాకు చెందిన కుతూహలమ్మ అనారోగ్యంతో తిరుపతిలోని ఆమె నివాసంలోనే కన్నుమూశారు

Former Minister Kutuhalamma Passed Away : మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత

Former Minister Gummadi Kutuhalamma passed away

Updated On : February 15, 2023 / 10:18 AM IST

Former Minister Kutuhalamma passed away : మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. చిత్తూరు జిల్లాకు చెందిన కుతూహలమ్మ అనారోగ్యంతో తిరుపతిలోని ఆమె నివాసంలోనే కన్నుమూశారు. గుమ్మడి కుతూహలమ్మ 1 జూన్ 1949లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రకాశం జిల్లాలోని కందుకూరులో జన్మించారు. ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసిన ఆమె కొంతకాలం వైద్య వృత్తిలో పసనిచేసి అనంతరం రాజకీయాల్లో చేరారు. 1979 నుండి 1981 వరకు డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పని చేసిన ఆమె 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశారు.

1980 – 1985 సమయంలో చిత్తూరు జిల్లా జెడ్పి చైర్ పర్సన్ గా, కో- ఆప్షన్ సభ్యురాలిగా పనిచేశారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి శాసనసభ సభ్యురాలయ్యారు. ఆమె 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు.1992-1993 మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.