AP Govt Doctors : AP సర్కార్ సంచలన నిర్ణయం.. 51 మంది వైద్యులు శాశ్వతంగా తొలగింపు..
AP Govt Doctors : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 51 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh Government Dismisses 51 Teaching Govt Hospital Doctors from duty for Prolonged Absence
- ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
- 51 మంది వైద్యుల శాశ్వత తొలగింపు
- ఏళ్ల తరబడి విధులకు డుమ్మా
AP Govt Doctors : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్య కాలేజీలు, బోధనాసుపత్రుల్లో పని చేస్తోన్న 51 మంది వైద్యులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో విధులు నిర్వహిస్తున్న వీరిలో 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. అయితే వీరిని తొలగించడానికి ప్రధాన కారణం.. వీరంతా చాలా కాలంగా తమ విధులకు హాజరు కావడం లేదని తేలింది. వీరిలో తొలగించిన వారిలో ఆంధ్ర మెడికల్ కాలేజీకి చెందిన ఓ అసోసియేట్ ప్రొఫెసర్.. ఏకంగా 2020, ఫిబ్రవరి నుంచి విధులకు హాజరు కావడం లేదని అధికారులు గుర్తించారు. అలానే మరికొందరు 2022 నుంచి విధులకు దూరంగా ఉన్నట్లు తేలింది.
తొలగించిన ఇద్దరు ట్యూటర్లలో ఒకరు ఏకంగా ఏడు సంవత్సరాల నుంచి విధులకు హాజరుకావడం లేదని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రభుత్వం వీరందరిని విధుల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. ఏపీ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారం ఏడాదికిపైగా విధులకు గైర్హాజరవుతున్న వారిని ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అయితే నేరుగా చర్యలు తీసుకోకుండా ముందుగా సంజాయిషీ నోటీసులు ఇచ్చి సమయం కూడా ఇచ్చామని వివరించారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో చివరకు తొలగింపు చర్యలు తీసుకున్నామన్నారు.
విధుల నుంచి తొలగించిన వారిలో మార్కాపురం, విశాఖపట్నం, విజయవాడ, కడప, అనంతపురం, రాజమహేంద్రవరం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, విజయనగరం, కాకినాడ, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన వైద్యులు ఎక్కువగా ఉన్నారు.
*ఇంటర్ లో 50 శాతం లోపు ఉత్తీర్ణత… సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్
విధుల నుంచి తొలగించిన వారిలో కొందరు వైద్యులు సొంత ఆస్పత్రులు, ఇతర వ్యాపకాలు, ప్రైవేట్ ప్రాక్టీసులు చూసుకుంటూ ప్రభుత్వ విధులకు దూరంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా రెగ్యులర్ నియామకాల ద్వారా ప్రభుత్వ విధుల్లో చేరినప్పటికీ.. కొందరు ఆస్పత్రులకు రాకుండా జీతాలు పొందుతున్నారని చాలా కాలం నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనివల్ల బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు దెబ్బతింటున్నాయని ప్రభుత్వం భావించింది. ప్రత్యేకంగా మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత కారణంగా విద్యార్థులు, రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివేదికలు రావడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. వీరందరిని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
