Contract Lecturers : కాంట్రాక్టు లెక్చరర్లకు సీఎం జగన్ శుభవార్త

కాంట్రాక్టు లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో..

Contract Lecturers : కాంట్రాక్టు లెక్చరర్లకు సీఎం జగన్ శుభవార్త

Andhra Pradesh Government Good News For Contract Lecturers

Updated On : July 23, 2021 / 4:10 PM IST

Andhra Pradesh Government Good News For Contract Lecturers : కాంట్రాక్టు లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాదిపాటు పొడిగించింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లో పని చేస్తున్న 719 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

జూన్ 2021 నుంచి ఓ పది రోజుల పాటు కాంట్రాక్టు లెక్చరర్ల సేవలకు విరామం ఉంటుందని ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రభుత్వం తాజాగా నిర్ణయం పట్ల కాంట్రాక్టు లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూతపడ్డ స్కూళ్లను ఆగస్టు 16 నుంచి పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. కాలేజీల విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.