Andhrapradesh : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 2,500 పోస్టుల భర్తీకి కసరత్తు.. ఈసారి వాటిపైనా పరీక్షలు
Andhrapradesh : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మళ్లీ డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
AP DSC 2026
- ఏపీలో మరోసారి డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు
- ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం
- ఈసారి పరీక్షలో ఆంగ్ల ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై పేపర్
Andhrapradesh : ఏపీలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. టీచర్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సమయాత్తం అవుతోంది. ఫిబ్రవరి నెలలో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
Also Read : Tirupati : తిరుపతిలో అర్ధరాత్రి ఆలయం గోపురం ఎక్కి మందుబాబు హల్‌చల్.. మూడు గంటలు హైడ్రామా..
రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి నెలలోనే సుమారు 2,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఈసారి డీఎస్సీలో కొత్తగా ఇంగ్లీష్ ప్రావీణ్యం, కంప్యూటర్‌పై అవగాహనకు సంబంధించి ఒక పేపర్‌గా ఎగ్జామ్ నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. డీఎస్సీతోపాటే కొత్త పేపర్ పరీక్ష జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.
విద్యా వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఆ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ సారథ్యంలో అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. బోధన నాణ్యతపై దీని ప్రభావం పడుతోందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది.
మరోవైపు ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణకు సంబంధించి పోస్టుల గుర్తింపు, రిజర్వేషన్ విధానం, పరీక్షా విధానంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.
