Covid Compensation Portal : కోవిడ్ పరిహారం కోసం కొత్త పోర్టల్ తెచ్చిన ఏపీ.. దరఖాస్తు తప్పనిసరి

కరోనా మహమ్మారికి ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ పోర్టల్ తీసుకొచ్చింది

Covid Compensation Portal : కోవిడ్ పరిహారం కోసం కొత్త పోర్టల్ తెచ్చిన ఏపీ.. దరఖాస్తు తప్పనిసరి

Covid Compensation Portal

Updated On : December 19, 2021 / 11:07 AM IST

Covid Compensation Portal : కరోనా మహమ్మారికి ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించింది ప్రభుత్వం. ఆర్థిక సాయం నేరుగా బాధిత కుటుంబాలకే చేరే విధంగా ఓ పోర్టల్ తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ. 50 వేలు పరిహారం చెల్లించడానికి ఆన్ లైన్ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత త్వరగా డబ్బు అందేలా చూస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

చదవండి : Coronavirus : కరోనా కేసులు, మళ్లీ పెరుగుతున్నాయి..జాగ్రత్త

బాధితులు http://covid19.ap.gov.in/exgratia పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం బాధితులు మృతుడికి కోవిడ్‌ నిర్థారించిన ఆర్‌టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ లేదా మాలిక్యులర్‌ టెస్ట్‌ రిపోర్టులలో ఏదో ఒక డాక్యుమెంట్‌ను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్‌ను పరిశీలించిన అనంతరం అధికారులు బాధితుల ఖాతాలోకి డబ్బు జమచేస్తారని పేర్కొన్నారు. నగదు పంపిణీలో అవకతవకలు జరగకూడదనే ఈ పోర్టల్ తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

చదవండి : AP Corona : ఏపీలో కరోనాతో ముగ్గురు మృతి, కొత్తగా 148 కేసులు

 

Andhra pradesh, government, Covid Compensation Portal, lunched