Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

చంద్రబాబుకు హైకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు ఇటు ఏసీబీ కోర్టులోను..అటు హైకోర్టులోను ఒకేసారి రెండు ఎదురు దెబ్బలు తగిలినట్లైంది.

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

Chandrababu ..AP HC

Chandrababu quash petition AP HC : చంద్రబాబుకు హైకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు ఇటు ఏసీబీ కోర్టులోను (ACB Court) అటు హైకోర్టులోను ఒకేసారి రెండు ఎదురు దెబ్బలు తగిలినట్లైంది. క్వాష్ పిటీషన్ కొట్టివేటయంతో హైకోర్టులో కూడా ఊరట దక్కలేదు. పిటీషన్ కొట్టివేటయంతో ఇక ఏసీబీ కోర్టులో కస్టడీ పిటీషన్ కు లైన్ క్లియర్ అయింది.

కాగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. పిటీషన్ ను కొట్టివేస్తున్నట్లుగా స్పష్టం చేసింది హైకోర్టు. ఈకేసులో సీఐడీ తరపు న్యాయవాదుల వాదనను ఏకీభవించింది ధర్మాసనం. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆ కేసును కొట్టివేయాలని తను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని.. తన రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు సెప్టెంబర్ 13న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు అంటూ పలు అంశాలు ప్రస్తావించారు.

Also Read: చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగింపు.. జడ్జితో బాబు ఏమన్నారంటే

చంద్రాబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీష్ సాల్వేలు వాదించారు. అలాగే సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబుకు రిమాండ్ అవసరం లేదు అంటూ లూథ్రా పలు కేసుల అంశాలను కోర్టు ముందుంచారు. అయినా కోర్టు మాత్రం సీఐడీ న్యాయవాది వాదనలనే పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం చివరకు చంద్రబాబుకు షాక్ ఇస్తు పిటిషన్ ను కొట్టివేసింది. దీనిపై నాలుగు రోజుల క్రితమే ముగిసినా తీర్పును వెల్లడించకుండా రిజర్వ్ చేసింది కోర్టు. తాజాగా ఈరోజు తీర్పును వెల్లడిస్తు క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లుగా వెల్లడించింది. దీంతో ఏసీడీ కోర్టులో కస్టడీ పిటిషన్ కు లైన్ క్లియర్ అయినట్లైంది.

Also Read: స్పీకర్ టీడీపీ సభ్యుల్ని యూజ్‌లెస్ ఫెలోస్ అని తిట్టారు, ఆ స్థానంలో ఉండి అలా అనొచ్చా : అచ్చెన్నాయుడు