AP Covid Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోయాయి.

Ap Covid Cases
AP Covid Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా.. కేవలం 320 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనాతో ఐదుగురు చనిపోయారు.
ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,68,241 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్టవ్యాప్తంగా మొత్తం 14వేల 397మంది కరోనాతో చనిపోయారు. ఏపీలో 3వేల 458 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 20లక్షల 50వేల 386 మంది కోలుకున్నారు.
మరో వైపు దేశవ్యాప్తంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. దేశంలో కూడా కరోనా కేసులు 10వేలు మాత్రమే ఉన్నాయి.