Road Missing : విశాఖ పరిధిలో రోడ్డు మాయం..మాకు ‘దారి’చూపించమని వేడుకుంటున్న గ్రామస్థులు

ఓ గ్రామంలో రోడ్డు మాయం అయిపోయింది. దీంతో గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. నడవటానికి దారిలేదు. మాకు ‘దారి’చూపించండి సార్ అంటూ వేడుకుంటున్నారు గ్రామస్తులు.

Road Missing :  విశాఖ పరిధిలో రోడ్డు మాయం..మాకు ‘దారి’చూపించమని వేడుకుంటున్న గ్రామస్థులు

Missing Road Is A Strange Problem For A Village Under Gvmc

Updated On : April 4, 2022 / 12:19 PM IST

Missing road is a strange problem for a village under GVMC : నెపోలియన్ అని.. ఆ మధ్య తెలుగులో ఓ సినిమా వచ్చింది గుర్తుంది కదూ.. అందులో.. హీరో ‘ నా నీడ పోయింది సార్’అంటూ ఫిర్యాదు చేస్తాడు. ఇది చూసి.. ఆడియెన్స్ అంతా అవాక్కయ్యారు. ఇప్పుడలాంటిదే జరిగింది జరిగింది. కానీ.. ఇక్కడ పోయింది నీడ కాదండోయ్. రోడ్డు…! మీరు విన్నది నిజమే..గ్రామస్తులంతా నడిచే రోడ్డు పోయింది…! అదికూడా మరెక్కడో కాదు మన ఏపిలోని విశాఖ పక్కనున్న ఓ ఊరిలో.. రోడ్డు పోయింది. రోడ్డు ఉంటేనే.. ఊరు ఉంటుంది. రోడ్డే లేకపోతే.. అక్కడ ఊరెలా ఉంటుంది? నిజానికి.. ఇదే అసలైన లాజిక్. మరి.. ఆ రోడ్డు ఎలా పోయింది?

ప్రతి గ్రామంలో ఓ సమస్య ఉంటుంది. రోడ్లు లేకపోవడమో.. తాగు నీటి సౌకర్యం సరిగా లేకపోవడమో.. మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఉండకపోవడమో.. ఇలా ఏదో రకమైన ఇబ్బందులుంటాయి. కానీ ఆ ఊరిలో మాత్రం రోడ్డే లేదు. ఈ గ్రామస్తులు మాత్రం తమ ఊరికి దారి చూపాలని వేడుకుంటున్నారు. ఇదెక్కడో మారుమూల ప్రాంతం కూడా కాదు. మహా విశాఖ నగరపాలక సంస్థ అయిన జీవీఎంసీ నాలుగో వార్డు పరిధిలో ఉంది. అదే.. జయంతివారి అగ్రహారం కల్లాలు.

Also read : Road Stolen: మా ఊర్లో కిలోమీటరు రోడ్డు మాయం అయిపోయింది సార్..వెతికిపెట్టిండీ..పోలీసులకు ఫిర్యాదు

గతంలో.. ఈ ఊరికి ఓ రోడ్డు ఉండేది.10 ఏళ్లుగా.. ఓ ప్రైవేట్ స్థలంలో నుంచే భీమిలి, దొరతోట మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు గ్రామస్తులు. కొన్ని దశాబ్దాల కిందట.. జేవీ అగ్రహారం కల్లాలు.. వ్యవసాయ పంటలతో నిండి ఉండేది. రైతులంతా.. ఆ కల్లాల్లోనే నివసిస్తూ పంటలు పండించేవారు. సుమారు పాతికేళ్ల నుంచి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. గ్రామస్తులంతా.. ఒక్కొక్కరిగా తమ పంట పొలాలు అమ్ముకోవడంతో.. గ్రామం చుట్టూ ఉన్న స్థలాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయ్. దీంతో.. గ్రామస్తులు.. ఓ ప్రైవేట్ స్థలంలో నుంచి కాలిబాట ఏర్పాటు చేసుకొని.. దాని గుండానే రాకపోకలు సాగిస్తున్నారు. ఐతే.. ఈ రోడ్డు ఉన్న స్థలం.. ప్రైవేట్ వ్యక్తికి చెందినది కావడంతో.. ఆ యజమాని తన స్థలంలో ప్రహరి నిర్మించుకుంటానని చెప్పాడు. గ్రామస్తులంతా.. కొత్త దారి చూసుకోవాలని తెగేసి చెప్పేశాడు. అంతే.. అప్పటి నుంచి తమ ఊరి కోసం వేట మొదలుపెట్టారు జయంతివారి కల్లాలు వాసులు.

ప్రస్తుతం కాలిబాట ఉన్న స్థలం.. దాని యజమాని చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో.. తమ పిల్లలు స్కూళ్లకు వెళ్లి ఎలా చదువుకుంటారోనని.. గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులే.. తమకొక దారి చూపాలని కోరుతున్నారు.ఈ వ్యవహారంపై.. స్థానిక కార్పొరేటర్ స్పందించారు. జయంతివారి అగ్రహారం కల్లాలు గ్రామంలో.. ప్రభుత్వ భూమి ఎంతుదనే దానిపై.. ఓ సర్వే నిర్వహిస్తామని..ఈ సమస్యను.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Also read : Crazy complaint : రోజంతా మేత మేస్తున్నా..మా ఆవులు పాలు ఇవ్వట్లేదు సార్..పోలీసులకు రైతు ఫిర్యాదు

పిల్లల చదువులకే కాదు.. పెద్దల పనులకు కూడా.. గ్రామస్తులంతా ఏ చిన్న పనికి ఊరు దాటాలన్నా.. సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా.. తమ గ్రామ సమస్యకు.. పరిష్కారం చూపాలని అధికారులను, నాయకులను వేడుకుంటున్నారు.