దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి.. ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఐపీబీ భేటీలో ఆమోదం.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే?

ఈ సమావేశంలో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపింది.

దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి.. ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఐపీబీ భేటీలో ఆమోదం.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే?

Chandrababu Naidu

Updated On : October 8, 2025 / 4:03 PM IST

Andhra Pradesh SIPB: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఇవాళ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) భేటీ జరిగింది. 11వ సారి నిర్వహించిన ఈ సమావేశంలో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపింది.

దీంతో  దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలిపినట్లయింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఎఫ్డీఐ రాలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఐటీ, ఇంధనం, టూరిజం, ఎరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. (Andhra Pradesh SIPB)

వీటి ద్వారా 67 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్న రెయిడెన్ ఇన్ఫో టెక్‌ డేటా సెంటర్‌కు ఆమోదముద్ర పడింది. ఈ సెంటర్ ఏర్పాటు కొత్త చరిత్రను లిఖిస్తుందని ఈ సమావేశంలో చెప్పారు.

Also Read: భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది నిజమే.. మేము ఇలా చేస్తాం: పాకిస్థాన్ రక్షణ మంత్రి

అతిపెద్ద ఫారిన్ ఇన్వెస్టిమెంట్ సాధించడంపై ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు అభినందనలు తెలిపారు. 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చంద్రబాబు అన్నారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది.

భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారుల నియామకానికి నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోనున్నారు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎస్‌ఐపీబీల ద్వారా రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. మొత్తం కలిపి 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.