Tirupati Svims : శరీరంలో 3 అడుగుల ఇనుప చువ్వ.. క్లిష్టమైన సర్జరీ విజయవంతం.

తిరుప‌తి స్విమ్స్ ఆస్ప‌త్రిలో క్లిష్ట‌మైన స‌ర్జ‌రీని వైద్యులు విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి శరీరంలోకి ఇనుప ఛువ్వు చొచ్చుకెళ్లింది.

Tirupati Svims : శరీరంలో 3 అడుగుల ఇనుప చువ్వ.. క్లిష్టమైన సర్జరీ విజయవంతం.

Tirupati Svims

Updated On : November 30, 2021 / 3:38 PM IST

Tirupati Svims : తిరుప‌తి స్విమ్స్ ఆస్ప‌త్రిలో క్లిష్ట‌మైన స‌ర్జ‌రీని వైద్యులు విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన కే లక్ష్మయ్య వృత్తిరీత్యా తాపీ పని చేస్తుంటాడు. ఈ నెల 27న సైట్‌లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడ్డాడు.. దీంతో అతడి పీరుదుల్లోంచి ఎడమ భుజం వరకు 3 అడుగుల ఇనుప చువ్వ చొచ్చుకెళ్లింది.

చదవండి : Svims Hospital: ఆక్సిజన్ సంక్షోభం అంచున స్విమ్స్.. కోత విధించిన కాంట్రాక్టర్!

దీంతో స్థానికులు అతడిని విజయవాడ, గుంటూరులోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. వైద్యులు తమ వల్ల కాదనడంతో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మయ్యకు పరీక్షలు చేసిన వైద్యులు, క్లిష్టమైన ఈ సర్జరీ చేసేందుకు ముందుకొచ్చారు.

సోమవారం స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట్రాల‌జీ విభాగాధిప‌తి ప్రొఫెస‌ర్ వీ వెంక‌ట్రామిరెడ్డి ఆధ్వ‌ర్యంలో సీటీ స‌ర్జ‌రీ విభాగం వైద్యురాలు డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి, మ‌త్తు వైద్య‌నిపుణులు డాక్ట‌ర్ మ‌ధుసూద‌న్ క‌లిసి అత్యంత క్లిష్ట‌మైన స‌ర్జ‌రీని విజ‌య‌వంతంగా నిర్వ‌హించి.. అతడి శరారంలోని చువ్వను తొలగించారు. ప్రస్తుతం లక్ష్మయ్య ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

చదవండి : Tirupati : తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో కుంగిన ఇల్లు కూల్చివేయాలని అధికారులు నిర్ణయం

Andhra pradesh Svims hospital iron rod in body surgery successful