Anil Kumar Yadav: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌తో చర్చించి కీలక సూచనలు చేసిన సీఎం జగన్

సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితులపై జగన్ చర్చించారు.

Anil Kumar Yadav: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌తో చర్చించి కీలక సూచనలు చేసిన సీఎం జగన్

Anil Kumar Yadav, Jagan

Updated On : June 26, 2023 / 8:12 PM IST

Anil Kumar Yadav – YSRCP: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. వైసీపీ బహిష్కృత నేత ఆనం రామనారాయణరెడ్డితో అనిత్ కుమార్ కు మాటల యుద్ధం జరుగుతుండడం, టీడీపీ నేత నారా లోకేశ్ నెల్లూరు జిల్లా (Nellore District)లో పర్యటిస్తుండడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ ఈ సమావేశం జరిగింది.

సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితులపై జగన్ చర్చించారు. నెల్లూరు సిటీ పార్టీలో విభేదాలు తలెత్తడం వంటి అంశాలపై జగన్ కు అనిల్ వివరించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పార్టీ పటిష్ఠంగా ఉందని జగన్ కూడా అన్నారు. నెల్లూరు సిటీలో మరో సారి గెలుస్తామని చెప్పారు.

వైసీపీ నేతలంతా ఐక్యంగా పార్టీ ఘనవిజయం కోసం కృషి చేయాలని అన్నారు. కాగా, నెల్లూరు సిటీ నుంచి పోటీచేస్తే ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ జీవితాన్ని పూర్తిగా ముగించేస్తామని ఇటీవలే అనిల్ సవాలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఒకవేళ తాను ఓడిపోతే కూడా రాజకీయాల వైదొలుగుతానని అన్నారు.

Bandi Sanjay: బండి సంజయ్‌ను వెంటనే ఢిల్లీకి రమ్మన్న బీజేపీ అధిష్ఠానం.. ఏం జరుగుతోంది?