ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే.. మార్చి 26లోగా పూర్తి చేయాలి : జగన్

  • Published By: sreehari ,Published On : March 24, 2020 / 03:49 PM IST
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే.. మార్చి 26లోగా పూర్తి చేయాలి : జగన్

Updated On : March 24, 2020 / 3:49 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ప్రతి ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలనూ వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు నమోదు చేయనున్నారు. ఈ నెల గురువారం (మార్చి 26)లోగా సర్వే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సర్వే సమగ్రంగా జరిపేందుకు ప్రజలు సహకరించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రజలంతా ఇళ్లలోనే ఉండి పాటించాలని చెప్పారు. డేటా ప్రకారం.. కోవిడ్‌–19 నివారణకు మరిన్ని చర్యలు  చేపట్టనున్నారు. సర్వే సమగ్రంగా జరిగేందుకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. లాక్‌డౌన్‌ను ప్రజలంతా పాటించాలన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్‌లో ఉన్నవారిపైన కాకుండా జన సామాన్యంపైన కూడా దృష్టి  పెడుతోంది. సర్వే డేటా ఆధారంగా మరిన్ని చర్యలు  చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్‌– 19 పరిస్థితిపై జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌–19 వ్యాప్తిని నిరోధించాలని,  దీనికోసం మరో దఫా వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో కలిపి సర్వే చేయించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటినీ కూడా సర్వే చేయాలన్నారు. 

సర్వే తర్వాత వివరాలను ప్రతిరోజూ అప్‌డేట్‌ చేయాలని చెప్పారు. లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే.. సత్వరమే వారికి వైద్య సహాయం అందించాలని సూచించారు. ఈ సర్వే సమగ్రంగా జరుగుతుండం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కోవిడ్‌–19ను వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలుగుతామన్నారు. ప్రజలు బయట తిరిగితే.. ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ వ్యాపిస్తుందని, అందువల్ల లాక్‌డౌన్‌ను ప్రజలంతా పాటించాలని సూచించారు. రాష్ట్రంలో కోవిడ్‌ –19 నివారణకు ప్రజలనుంచి పూర్తి సహకారం ఆశిస్తున్నామని జగన్ చెప్పారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ పాజిటవ్‌గా తేలిన కేసులన్నీ కూడా విదేశాలనుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారేనని స్పష్టం చేశారు. ఇది సామాన్య ప్రజలకు వ్యాపించకుండా ఉండాలంటే వైద్య, ఆరోగ్యశాఖ, ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రెండోసారి సర్వే ద్వారా వచ్చే డేటాను విశ్లేషించుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని జగన్ తెలిపారు. లక్షణాలు ఉన్నవారు విధిగా హోం ఐసోలేషన్‌ పాటించాలని సూచించారు.