Leopard: బాబోయ్ మరో చిరుత..! తిరుమల కాలినడక మార్గంలో ఇంకో చిరుతపులి.. ఎలుగుబంటిసైతం ప్రత్యక్షం..

శ్రీవారి మెట్ల మార్గంలో 2వేల శ్రీవారి మెట్టు దగ్గర ఎలుగుబంటి కనిపించింది. చెట్టుమాటున కూర్చొని ఉన్న ఎలుగు బంటిని చూసిన భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.

Leopard: బాబోయ్ మరో చిరుత..! తిరుమల కాలినడక మార్గంలో ఇంకో చిరుతపులి.. ఎలుగుబంటిసైతం ప్రత్యక్షం..

Another Cheetah

Leopard In Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు కాలినడకన వెళ్లే భక్తులకు చిరుతపులి భయం వెంటాడుతోంది. గత మూడు రోజుల క్రితం నడకదారిలో వెళ్తున్న ఆరేళ్ల చిన్నారిని చిరుతపులి హతమార్చింది. ఈ విషాదం ఘటనతో టీటీడీ అలర్ట్ అయింది. చిన్నారి మృతికి కారణమైన చిరుత పులిని పట్టుకొనేందుకు అటవీశాఖ, టీటీడీ సిబ్బంది బోనులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఎట్టకేలకు సోమవారం తెల్లవారుజామున చిరుతపులి బోనులో చిక్కింది. దీంతో హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్న భక్తులకు కొద్ది సమయంలోనే మరో చిరుత పులి ఉందన్న వార్త వణుకుపుట్టించింది.

Tirumala : తిరుమలలో చిక్కిన చిరుత.. బాలికపై దాడిచేసిన ప్రాంతానికి దగ్గర్లోనే బోనులోకి

తిరుమల నడకదారిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ సమీపంలో భక్తులకు చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. తిరుమల కాలినడక మార్గంలో ఐదు చిరుతలు తిరుగుతున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. సోమవారం బోనులో చిక్కిన చిరుత పిల్లలే భక్తులకు కనిపించి ఉంటాయని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కిందని తెలిపారు. అయితే, ఇంకాఏమైనా చిరుత పులులు ఉన్నాయా అనే అనుమానంతో బోనులు మరిన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో చిరుతల భయం తొలగించాలని అటవీ అధికారులను కోరడం జరిగిందని అన్నారు.

Tirumala Cheetah Attack : తిరుమలలో బాలికను చిరుత చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టు

ఇదిలాఉంటే.. భక్తులకు చిరుత కనిపించిన ప్రాంతానికి అటవీ అధికారులు వెళ్లి పరిశీలించారు. పలు దఫాలుగా పరిశీలన అనంతరం చిరుతపులి కాదని అంచనాకు వచ్చారు. దుప్పిలాంటి వన్యప్రాణి అయి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. చిరుత పులితో భక్తులు హడలిపోతున్న క్రమంలో ఎలుబంటి భక్తులకు కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. శ్రీవారి మెట్ల మార్గంలో 2వేల శ్రీవారి మెట్టు దగ్గర ఎలుగుబంటి కనిపించింది. 2వేల మెట్టు అంటే తిరుమల కొండకు దాదాపుగా చేరుకున్నట్లే. చెట్టుమాటున కూర్చొని ఉన్న ఎలుగు బంటిని చూసిన భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కొందరు ఫొటోలనుతీసి అటవీ అధికారులుకు సమాచారం అందించారు. వరుసగా చిరుత పులులు, ఎలుగుబంటి వంటి వన్యమృగాలు తిరుమల నడకదారిలో భక్తులకు కనిపించడంతో భక్తులు హడలిపోతున్నారు. అయితే, టీటీడీ మాత్రం నడకదారిలో వచ్చే భక్తులకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.