10th Class Results: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు.

10th Class Results
10th Class Results: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా.. వీరిలో 4,98,585 మంది విద్యార్థులు (81.14శాతం) ఉత్తీర్ణత సాధించారు.
బాలురు 78.31శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వందశాతం ఫలితాలురాగా.. 19పాఠశాలల్లో ఎవ్వరూ ఉత్తీర్ణత కాలేదు. జిల్లాల వారిగా ఫలితాలను పరిశీలిస్తే.. ఉత్తీర్ణతలో పార్వతీపురం మన్యం అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో 93.90శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
వాట్సాప్ లో ఫలితాలు ఇలా..
◊ విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ చేయాలి.
◊ వెంటనే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.
◊ అందులో విద్యా సేవలను ఎంచుకోవాలి.
◊ అనంతరం SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను సెలక్ట్ చేయాలి.
◊ అక్కడ రోల్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
◊ ఈ రిజల్ట్ పీడీఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..