Smoking in flight : విమానంలో సిగరెట్ తాగిన ఏపీ వ్యక్తి అరెస్ట్
విమానంలో సిగరెట్ తాగిన ఏపీ వ్యక్తిని చెన్నైలో అరెస్ట్ చేశారు.

Ap Man Smoking inside Flight (1)
AP Man Smoking inside flight ; బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నేరం. అలా చేస్తే శిక్షార్హం కూడా. బహిరంగ ధూమపానంపై ఇటువంటి నిబంధనలు ఉన్న భారత్ లో ఓ వ్యక్తి దాన్ని ఖాతరు చేశాడు. ఏకంగా విమానంలోనే దర్జాగా సిగరెట్ కాల్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తే కావటం గమనించాల్సిన విషయం. కువైట్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో 137 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆ విమానంలో ఏపీకి చెందిన 57 ఏళ్ల మహ్మద్ షరీఫ్ ఉన్నాడు. అతడు సెక్యూరిటీ కళ్లు ఎలా కప్పాడో గానీ విమానంలోకి సిగిరెట్లు తెచ్చాడు.తెచ్చుకున్నవాడు కుదురుగా ఉండకుండా ఏకంగా విమానంలోనే సిగరెట్ కాల్చాడు.
Read more : HYD N umaish : హైదరాబాద్‌లో మళ్లీ నుమాయిష్ సందడి మొదలుకానుందా..?
విమానం టేకాఫ్ అయిన కాసేపటికి మహ్మద్ షరీఫ్ స్మోకింగ్ చేయడం ప్రారంభించాడు. తోటి ప్రయాణికులు అదేమని ప్రశ్నించినా..విమానంలో సిగిరెట్లు కాల్చకూడదని సూచించినా వినలేదు. దీంతో తోటి ప్రయాణీకులు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎయిర్ హోస్టెస్ వచ్చి మర్యాదగా..‘సార్ సిగిరెట్ ఆర్పేయండీ..విమానంలో నో స్పోంగిక్..అర్థం చేసుకోండి అంటూ ఎంతో మర్యాదగా చెప్పినా వినలేదు. సిగిరెట్ కాల్చటం మానలేదు.
Read more : Gold Sales : దీపావళికి 50 టన్నుల బంగారం కొన్నారు
పదే పదే చెప్పినా వినకపోవటంతో షరీఫ్ ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ సిబ్బందితో గొడవకు దిగాడు. దీంతో విమానం చెన్నైలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని విచారణ తర్వాత చెన్నై ఎయిర్‌పోర్టులోని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. విచారణలో షరీఫ్ సిగిరెట్లను బట్టల్లో దారి విమానంలోకి తెచ్చినట్లుగా తేలింది.